నా మందును జనాల్లోకి వెళ్లనీయలేదు: నెల్లూరు ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 28, 2021, 3:01 PM IST
Highlights

నెల్లూరు ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా వచ్చారని... అయితే, గ్రామస్తులంతా అండగా నిలవడంతో అరెస్ట్ చేయకుండా వెనుదిరిగారని చెప్పారు

కరోనా సెకండ్ వేవ్ సమయంలో తన ఆయుర్వేదం మందుతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నెల్లూరు ఆనందయ్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా నివారణ కోసం ఆనందయ్య తయారు చేసిన మందు కోసం ఆ రోజుల్లో జనాలు ఎగబడ్డారు. ఆయన ఉంటున్న గ్రామం తిరునాళ్లను తలపించింది. జనాలను అదుపు చేసేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగాల్సి వచ్చింది. దేశంలోని మీడియా సంస్థలు, ఆరోగ్య నిపుణులు సైతం ఆనందయ్య కోసం తరలివచ్చారు. ఆ తర్వాత ప్రభుత్వం కలగజేసుకుని ఆయన మందు ఎంత మేరకు సురక్షితమనే దానిపై పరీక్షలు నిర్వహించిన తర్వాతే కొన్ని మందులకు క్లీన్ చీట్ ఇచ్చింది. అయితే ఆ తర్వాత క్రమంగా ఆనందయ్య మందు మరుగున పడిపోయింది.

Also Read:నా పేరుతో నకిలీ మందులు: ఆనందయ్య సంచలనం

ఈ నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కనిపెట్టిన మందు ప్రజల్లోకి వెళ్లకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. తనను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కూడా వచ్చారని... అయితే, గ్రామస్తులంతా అండగా నిలవడంతో అరెస్ట్ చేయకుండా వెనుదిరిగారని చెప్పారు. విజయనగరంలో జరిగిన యాదవ మహాసభ సమితి కార్యక్రమంలో మాట్లాడుతూ ఆనందయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయుర్వేదానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని చెప్పారు.  

click me!