ఏపీలో కరోనా విశ్వరూపం: మళ్లీ 24 వేలు దాటిన కేసులు.. తూ.గో వెనక్కి, అగ్రస్థానంలో అనంతపురం

Siva Kodati |  
Published : May 16, 2021, 07:07 PM IST
ఏపీలో కరోనా విశ్వరూపం: మళ్లీ 24 వేలు దాటిన కేసులు.. తూ.గో వెనక్కి, అగ్రస్థానంలో అనంతపురం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విశ్వరూపాన్ని చూపిస్తోంది. గడిచిన కొన్నిరోజుల్లో ఎన్నడూ లేని విధంగా ఇవాళ రోజు వారీ కేసులు 24 వేలను దాటిపోయాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట కర్ఫ్యూను సైతం ప్రభుత్వం అమలు చేస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విశ్వరూపాన్ని చూపిస్తోంది. గడిచిన కొన్నిరోజుల్లో ఎన్నడూ లేని విధంగా ఇవాళ రోజు వారీ కేసులు 24 వేలను దాటిపోయాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పగటి పూట కర్ఫ్యూను సైతం ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనికి తోడు కొన్ని చోట్ల కఠిన ఆంక్షలను సైతం విధించారు.

అయినప్పటికీ కేసుల తీవ్రతలో ఎలాంటి మార్పు లేకపోవడంతో అధికార వర్గాల్లో ఆందోళన మొదలైంది.  గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 24,171 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 14,35,491కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 101 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 9372కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 9, అనంతపురం 14, తూర్పుగోదావరి 9, చిత్తూరు 10, గుంటూరు 9, కర్నూలు 6, నెల్లూరు 7, కృష్ణ 9, విశాఖపట్నం 11, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 3, ప్రకాశం 6,  కడపలో ఇద్దరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 21,101 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 12,15,683కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 94,550 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,79,75,305కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,10,436 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 3356, చిత్తూరు 2885, తూర్పుగోదావరి 2876, గుంటూరు 1787, కడప 1638, కృష్ణ 705, కర్నూలు 730, నెల్లూరు 1593, ప్రకాశం 1628, శ్రీకాకుళం 1509, విశాఖపట్నం 2041, విజయనగరం 997, పశ్చిమ గోదావరిలలో 2426 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu