ఏపీలో 5 వేలు క్రాస్ చేసిన కరోనా : కొత్తగా 216 కేసులు, ఇద్దరి మృతి

Siva Kodati |  
Published : Jun 09, 2020, 06:26 PM ISTUpdated : Jun 09, 2020, 06:29 PM IST
ఏపీలో 5 వేలు క్రాస్ చేసిన కరోనా : కొత్తగా 216 కేసులు, ఇద్దరి మృతి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం రికార్డు స్థాయిలో 216 మందికి పాజిటివ్‌గా తేలడంతో  మొత్తం కేసుల సంఖ్య 5,029కి చేరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల తాకిడి ఏ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం రికార్డు స్థాయిలో 216 మందికి పాజిటివ్‌గా తేలడంతో  మొత్తం కేసుల సంఖ్య 5,029కి చేరింది. పాజిటివ్‌గా తేలిన వారిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారు 147, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 69 మంది ఉన్నారు.

కాగా రాష్ట్రంలో ఇవాళ కరోనాతో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 77కి చేరింది. ఏపీలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,510 కాగా, ఇప్పటి వరకు 2,403 మంది డిశ్చార్జ్  అయ్యారు.

Also Read:ఏపీలో బార్లకు నో పర్మిషన్: వైన్స్‌ దుకాణాల్లో బార్లలోని మద్యం విక్రయానికి గ్రీన్ సిగ్నల్

మరోవైపు సచివాలయంలో  పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులకు కోవిడ్ 19 సోకడం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది. మరోవైపు ఈ పరిణామాలు ఈ నెల 11న జరగనున్న రాష్ట్ర మంత్రి మండలి సమావేశంపై ప్రభావం చూపే పరిస్ధితులు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కేబినెట్ భేటీ ఎలా నిర్వహించాలనే దానిపై సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు 10 మంది సెక్రటేరియేట్ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా తేలింది.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఛాంబర్ ఉండే ఫస్ట్ బ్లాక్‌లో జీఏడీ ఉద్యోగికి, ఆర్‌టీజీఎస్‌ ఉద్యోగికి కరోనా సోకింది. సచివాలయంలో పనిచేసే వ్యవసాయ, సహకార శాఖల ఉద్యోగులకు ఇప్పటికే  వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించారు పూనం మాలకొండయ్య.

Also Read:రెండు రోజుల క్రితం అరెస్ట్: తిరుపతిలో ఎర్రచందనం స్మగ్లర్ కు కరోనా పాజిటివ్

అలాగే పరిశ్రమల శాఖ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చారు. కాగా సచివాలయ ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయాన్ని కల్పించాలని సీఎస్ నీలం సాహ్నికి ఉద్యోగుల సంఘాలు ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి.

కరోనా కారణంగా సచివాలయంలో మంత్రి మండలి సమావేశం కుదరని పక్షంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli