ఏపీలో కరోనా జోరు: కొత్తగా 21,320 కేసులు.. రాయలసీమపై విశ్వరూపం

Siva Kodati |  
Published : May 18, 2021, 09:07 PM IST
ఏపీలో కరోనా జోరు: కొత్తగా 21,320 కేసులు.. రాయలసీమపై విశ్వరూపం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కర్ఫ్యూను అమలు చేస్తున్నప్పటికీ కేసుల తీవ్రతలో ఎలాంటి మార్పు లేకపోవడంతో అధికార వర్గాల్లో ఆందోళన మొదలైంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 21,320 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 14,75,372కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 99 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 9580కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 10, అనంతపురం 8, తూర్పుగోదావరి 9, చిత్తూరు 10, గుంటూరు 8, కర్నూలు 6, నెల్లూరు 5, కృష్ణ 10, విశాఖపట్నం 8, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 8, ప్రకాశం 9,  కడపలో ఇద్దరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 21,274 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 12,54,291కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 21,320 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,81,40,307కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,11,501 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 2804, చిత్తూరు 2630, తూర్పుగోదావరి 2923, గుంటూరు 1291, కడప 1036, కృష్ణ 1048, కర్నూలు 991, నెల్లూరు 1251, ప్రకాశం 785, శ్రీకాకుళం 1466, విశాఖపట్నం 2368, విజయనగరం 965, పశ్చిమ గోదావరిలలో 1762 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

PREV
click me!

Recommended Stories

He is true Hero! మైనారిటీల కోసం అలుపెరగని పోరాటం | Dr Masthan Basha about Abdul Azeez | Asianet News
Pawan Kalyan Pressmeet: ఢిల్లీలో ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం | Asianet News Telugu