ఏపీలో కరోనా కరాళనృత్యం: 210 కొత్త కేసులు, మొత్తం 4,460 పాజిటివ్ కేసులు

By telugu teamFirst Published Jun 6, 2020, 1:44 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి వ్యాపిస్తూనే ఉంది. గత 24 గంటల్లో ఏపీలో 210 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రాష్ట్రంలో మరణాలు సంభవించలేదు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి విజృంభిస్తూనే ఉంది. ఏపీలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 210 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో 161 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 41 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. విదేశాల నుంచి వచ్చినవారిలో ఎనిమిది మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. 

కొత్తగా రాష్ట్రంలో మరణాలేవీ సంభవించలేదు. దీంతో రాష్ట్రంలో కోరనా వైరస్ మరణాల సంఖ్య 73గానే ఉంది. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి నుంచి 2,323 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ కాగా, 1192 మంది ఆస్పత్రుల్లో ఇంకా చికిత్స పొందుతున్నారు. 

శనివారంనాడు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 12,771 శాంపిల్స్ ను పరీక్షించగా 161 మందికి కోవిడ్ -19 పాజిటివ్ వచ్చినట్లు తేలింది. గత 24 గంటల్లో 29 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. ఒక్క మరణం కూడా సంభవించలేదు. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు 3,588 ఉన్నాయి. 

కాగా, విదేశాల నుంచి వచ్చినవారిలో 131 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. ఈ మొత్తం కేసుల్లో 127 యాక్టివ్ గా ఉన్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 741 మందికి కోరనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. వీరిలో ఈ రోజు 16 మంది కోలుకుని డిశ్చార్జయ్యారు. 467 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  

 

pic.twitter.com/OGzcwyre7g

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!