గుంటూరులో అత్యధికం: ఏపీలో స్వల్పంగా పెరుగుదల.. 8,85,437కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Jan 13, 2021, 07:05 PM ISTUpdated : Jan 13, 2021, 07:06 PM IST
గుంటూరులో అత్యధికం: ఏపీలో స్వల్పంగా పెరుగుదల.. 8,85,437కి చేరిన కేసులు

సారాంశం

ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 203 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,437కి చేరింది. నిన్న ఒక్కరోజు కోవిడ్ వల్ల ఒక మరణం సంభవించింది. దీని వల్ల ఏపీలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 7,134కి చేరుకుంది.

ఏపీలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 203 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,437కి చేరింది. నిన్న ఒక్కరోజు కోవిడ్ వల్ల ఒక మరణం సంభవించింది.

దీని వల్ల ఏపీలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 7,134కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,382కి చేరింది. గడిచిన 24 గంటల్లో 231 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,75,921కి చేరింది. నిన్న ఒక్కరోజు 44,679 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు చేయడంతో మొత్తం టెస్టుల సంఖ్య 1,24,41,272కి చేరుకుంది.

కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు అనంతపురం 23, చిత్తూరు 18, తూర్పు గోదావరి 27, గుంటూరు 41, కడప 9, కృష్ణ 30, కర్నూలు 2, ప్రకాశం 2, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 22, విజయనగరం 9, పశ్చిమ గోదావరిలలో 7 కేసులు నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబుపై జగన్ పంచ్ లు EL NINO ఎఫెక్ట్ కాదు ఇది YELLOW NINO ఎఫెక్ట్ | Asianet News Telugu
Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే