టీడీపీదే శాశ్వ‌త అధికారం

Published : Aug 28, 2017, 04:01 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
టీడీపీదే శాశ్వ‌త అధికారం

సారాంశం

టీడీపీ విజయం పై సంతోషం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. 2019లో కూడా టీడీపీనే గెలుస్తుందని ధీమా.

2019 లో కూడా టీడీపీదే అధికారమ‌ని ధీమా వ్య‌క్తం చేశారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన టీడీపీ అభ్య‌ర్థీ భూమా బ్ర‌హ్మానంద రెడ్డి కి ఆయ‌న‌ అభినంద‌న‌లు తెలిపారు. వైసీపీ నంద్యాల ఉప ఎన్నిక‌లో ప్ర‌లోభాల‌కు గురిచేసినందుకు స్థానికులు త‌గిన బుద్ది చెప్పార‌ని ముఖ్య‌మంత్రి పెర్కోన్నారు. నంద్యాలలో జగన్ పదిహేనురోజుల పాటు బస చేసి ప్రలోభాలకు పాల్పడినా ప్రజలు తిరస్కరించారని, అన్ని వర్గాల ప్రజలు టీడీపీని ఆదరించారని అన్నారు. ఈ విజయం అభివృద్ధికి నిదర్శనమని చెప్పారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తామని, అవినీతిని నిర్మూలించి, ప్రజలు మెచ్చుకునే పాలన అందించి, శాశ్వతంగా టీడీపీ అధికారంలో ఉండేలా చేస్తామని అన్నారు. నంద్యాల ఉపఎన్నిక ఫలితం రాబోయే ఎన్నికలకు నిదర్శనమని చంద్ర‌బాబు అన్నారు. 

 

 

 

మరిన్నీ తాజా విశేషాల కోసం కింద క్లిక్ చేయండి 

నంద్యాల విజ‌యంపై అమాత్యులు ఎమ‌న్నారంటే..

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu