మచిలీపట్నం అత్యాచార ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. పోసిన నాగబాబు, యర్రంశెట్టి మణిదీప్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
బందరు (మండలం పల్లెపాలెం బీచ్‌లో యువతి అత్యాచారానికి గురైన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. దీనిపై ఫిర్యాదు అందిన వెంటనే 24 గంటలలోనే నిందితులను అరెస్టు చేసినట్లు మచిలీపట్నం డీఎస్పీ తెలిపారు. నిందితులైన పోసిన నాగబాబు, యర్రంశెట్టి మణిదీప్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చారు.
నిందితులిద్దరికీ మద్యం సేవించడం, వ్యభిచార గృహాలకు వెళ్లడం వంటి చెడు వ్యసనాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే పల్లిపాలెం బీచ్‌కు స్నేహితుడితో వెళ్లి వస్తున్న యువతిపై పోసిన నాగబాబు అత్యాచారం చేయగా మణిదీప్ సహకరించినట్లు పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ పేర్కొన్నారు.
undefined
కాగా.. మచిలీపట్నం (machilipatnam) ప్రాంతానికి చెందిన ఓ యువతి తన స్నేహితుడితో బుధవారం కరగ్రహారం శివారు Pallipalem Beachకు వెళ్లింది. వీరిని గమనించిన ఆ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు liquor మత్తులో అక్కడికి వచ్చారు. యువకుడిని కట్టేసి యువతి మీద అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు విషయం సోదరుడికి తెలపడంతో అతని ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు.
మరోవైపు.. మార్చి 2న తెలంగాణలో అత్యాచార ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళకు Instagram లో ఓ యువకుడు పరిచయమయ్యాడు. ఇద్దరు WhatsAppలో చాటింగ్ చేసుకున్నారు. యువకుడిని నమ్మి అతని వెంట వెళ్లిన మహిళను Molestation చేశాడు’ అని రాజేంద్రనగర్ కనకయ్య తెలిపారు. రాజేంద్రనగర్ పరిధిలోని సులేమాన్ నగర్ లో నివసించి సాజిత్ (27) ప్రైవేటు ఉద్యోగి. అతడికి రెండు రోజుల క్రితం ఇన్ స్టాగ్రామ్ లో సంతోష్ నగర్ కు చెందిన ఓ యువతి (20)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరు Phone numbers తీసుకుని చాటింగ్ చేసుకున్నారు.
సాజిత్ యువతిని కలవాలని కోరాడు. రాజేంద్ర నగర్ కు వచ్చిన యువతిని తన ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని సులేమాన్ నగర్ లో నివసించే అతడి స్నేహితుల ఇంటికి తీసుకువెళ్లాడు. అక్కడ సదరు యువతిపై అత్యాచారం చేశాడు. ఆమె డయల్ హండ్రెడ్ కాల్ చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకుని సాజిత్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఆ యువతితో ఇంస్టాగ్రామ్ లో పరిచయం పెంచుకుని వాట్స్అప్ ద్వారా చాటింగ్ చేశాడు. ఆ తరువాత ఐస్ క్రీమ్ పార్లర్ కు వెళదామని చెప్పి.. రమ్మని స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆరు గంటలపాటు ఆమెకు నరకయాతన చూపించాడు. ఆ తరువాత ఆమె వీలు చూసుకుని డయల్ 100కి ఫోన్ చేయడం ద్వారా రాజేంద్రనగర్ పోలీసులు ఆమెను కాపాడారు. నిందితుడిని అదుపులోకి బాధితురాలి ఆస్పత్రికి తరలించారు.