చిత్తూరు, ఉభయగోదావరిల్లో మృత్యుఘోష... ఏపీలో కొత్తగా 19,981 కేసులు

Siva Kodati |  
Published : May 22, 2021, 05:53 PM IST
చిత్తూరు, ఉభయగోదావరిల్లో మృత్యుఘోష... ఏపీలో కొత్తగా 19,981 కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కాకపోతే రెండ్రోజులతో పోలిస్తే స్వల్పంగా కేసులు తగ్గాయి. కర్ఫ్యూతో పాటు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో అధికార యంత్రాంగం తల పట్టుకుంటోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 19,981 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కాకపోతే రెండ్రోజులతో పోలిస్తే స్వల్పంగా కేసులు తగ్గాయి. కర్ఫ్యూతో పాటు ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నప్పటికీ కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో అధికార యంత్రాంగం తల పట్టుకుంటోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 19,981 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 15,62,060కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 118 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,022కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 10, అనంతపురం 9, తూర్పుగోదావరి 11, చిత్తూరు 14, గుంటూరు 10, కర్నూలు 7, నెల్లూరు 7, కృష్ణ 9, విశాఖపట్నం 11, శ్రీకాకుళం 8, పశ్చిమ గోదావరి 15, ప్రకాశం 7, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 18,336 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 13,41,355కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 90,609 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,85,25,758కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,10,683మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1787, చిత్తూరు 2581, తూర్పుగోదావరి 3227, గుంటూరు 1040, కడప 893, కృష్ణ 1064, కర్నూలు 1161, నెల్లూరు 912, ప్రకాశం 1295, శ్రీకాకుళం 1338, విశాఖపట్నం 2308, విజయనగరం 838, పశ్చిమ గోదావరిలలో 1537 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో వర్షాలు.. మరోపక్క మండే ఎండలు.. ఎల్లో అలర్ట్ !
FULL SPEECH : గొడ్డలి పార్టీ తట్టుకోలేకపోతుంది | CM Chandrababu Full Speech Today | Asianet Telugu