విమ్స్ భవనంపై నుండి దూకి వి.సుధాకర్ ( 49 ) అనే కోవిడ్ రోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
విశాఖపట్నం: కరోనాలో బాధపడుతూ చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి భయంతో ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. విమ్స్ భవనంపై నుండి దూకి వి.సుధాకర్ ( 49 ) అనే కోవిడ్ రోగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఆత్మహత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
ఇదిలావుంటే గుంటూరులో కూడా కరోనా మహమ్మారి తల్లీ కొడుకులు ప్రాణాలు బలితీసుకుంది. కరోనాతో ఇటీవలే కొడుకు చనిపోగా తాజాగా వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తున్న తల్లి ఉమాదేవి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. నగరంపాలెం సీఐ వేధింపుల వల్లే ఉమాదేవి ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఉమాదేవి వ్యవసాయ శాఖలో సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నారు.
undefined
ఆమె పెద్ద కొడుకు బాజీ కిరణ్ జర్మనీలో ఉద్యోగం చేస్తున్నారు. నెల క్రితం తమ్ముడు అరుణ్ పెళ్లి కోసం గుంటూరుకు వచ్చాడు. కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడిన కిరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఇక అప్పటి నుంచి కిరణ్ భార్య అంజనీ కుమార్ ఆస్తి పంచాలని ఇదే విషయంపై నగరంపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
అత్త, మరిది, ఆడపడుచు వేధిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై నగరంపాలెం సీఐ మల్లిఖార్జున్ రావు, కానిస్టేబుల్ మణిలు ఉమాదేవితో పాటు కుటుంబసభ్యులను స్టేషన్‌కు పిలిపించి బెదిరించారని ఆరోపిస్తున్నారు. సీఐ వేధింపుల వల్ల తమ తల్లి ఉమాదేవి ఆత్మహత్య చేసుకుందని మండిపడుతున్నారు.