కృష్ణాలో అత్యధికం: ఏపీలో కొత్తగా 197 కేసులు, 8,85,234 కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Jan 12, 2021, 08:52 PM ISTUpdated : Jan 12, 2021, 10:43 PM IST
కృష్ణాలో అత్యధికం: ఏపీలో కొత్తగా 197 కేసులు, 8,85,234 కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 197 మందికి కోవిడ్ నిర్థారణ జరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 8,85,234కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 197 మందికి కోవిడ్ నిర్థారణ జరిగినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 8,85,234కి చేరింది.

నిన్న ఒక్క రోజు కరోనా కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,133కి చేరుకుంది. గత 24 గంటల్లో 234 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. వీరితో కలిపి మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,75,690కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో 2,411 యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 40,986 మందికి కోవిడ్ టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్ధారణా పరీక్షలు సంఖ్య 1,23,96,593కి చేరింది.

నిన్న ఒక్కరోజు అనంతపురం 6, చిత్తూరు 32, తూర్పుగోదావరి 19, గుంటూరు 31, కడప 14, కృష్ణా 49, కర్నూలు 3, నెల్లూరు 6, ప్రకాశం 5, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 15, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 7 కేసులు నమోదయ్యాయి. కోవిడ్ వల్ల కడప, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు. 

 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu