ఏపీలో ప్రారంభమైన పగటిపూట కర్ఫ్యూ : ప్రజా రవాణా బంద్

By narsimha lodeFirst Published May 5, 2021, 12:19 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం మధ్యాహ్నం నుండి పగటి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం మధ్యాహ్నం నుండి పగటి పూట కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కరోనా కేసుల వ్యాప్తిని నిరోధించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ కూడ అమల్లో ఉంది.  రెండు వారాల పాటు పగటిపూట కర్ఫ్యూను  అమలు చేస్తారు. 

ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరుచుకొనేందుకు అనుమతిని ఇచ్చారు. అయితే 12 గంటల వరకు కూడ ఆంక్షలు ఉంటాయి. 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఒకే చోట ఐదుగురు గుంపులుగా ఉండకూడదు.  ఒకవేళ అలా గుంపుగా ఉంటే  కఠిన చర్యలు తీసుకొంటారు.పగటిపూట కర్ఫ్యూ సమయంలో అత్యవసర సేవలకు మినహాయింపును ఇచ్చింది 

also read:కరోనా ఎఫెక్ట్: మే 5 నుండి ఏపీలో పగటిపూట సైతం కర్ఫ్యూ

రాష్ట్రాల సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. సాధారణ వాహనాలకు  కర్ఫ్యూ సమయంలో అనుమతిని ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కర్ఫ్యూ సమయంలో వాహనాలు తిరగకుండా ఉండేందుకు గాను  పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. పగటిపూట కర్ఫ్యూ సమయంలో ప్రజా రవాణాను నిలిపివేశారు. 

click me!