ఏపీలో కరోనా జోరు: కొత్తగా 16,167 మందికి పాజిటివ్.. కేసుల్లో, మరణాల్లో చిత్తూరే టాప్

Siva Kodati |  
Published : May 27, 2021, 06:14 PM ISTUpdated : May 27, 2021, 06:15 PM IST
ఏపీలో కరోనా జోరు: కొత్తగా 16,167 మందికి పాజిటివ్.. కేసుల్లో, మరణాల్లో చిత్తూరే టాప్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 16,167 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.   

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 16,167 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 16,43,557కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 104 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 10,531కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 8, ప్రకాశం 8, అనంతపురం 9, తూర్పుగోదావరి 6, చిత్తూరు 14, గుంటూరు 8, కర్నూలు 6, నెల్లూరు 9, కృష్ణ 6, విశాఖపట్నం 11, శ్రీకాకుళం 6, పశ్చిమ గోదావరి 13, ప్రకాశం 7, కడపలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 21,385 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 14,46,244కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 84,224 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,89,24,545కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,86,782 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 1472, చిత్తూరు 2967, తూర్పుగోదావరి 2325, గుంటూరు 991, కడప 776, కృష్ణ 682, కర్నూలు 981, నెల్లూరు 1137, ప్రకాశం 1069, శ్రీకాకుళం 679, విశాఖపట్నం 1434, విజయనగరం 562, పశ్చిమ గోదావరిలలో 1092 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage
నేతన్నలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 25వేలు| Asianet News Telugu