తూ.గో, చిత్తూరులలో అత్యధికం: ఏపీలో 8.50 లక్షలు దాటిన కేసులు

Siva Kodati |  
Published : Nov 13, 2020, 06:50 PM IST
తూ.గో, చిత్తూరులలో అత్యధికం: ఏపీలో 8.50 లక్షలు దాటిన కేసులు

సారాంశం

ఏపీలో గత 24 గంటల్లో 1,593 మందికి కరోనా నిర్థారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,51,298కి చేరింది

ఏపీలో గత 24 గంటల్లో 1,593 మందికి కరోనా నిర్థారణ అయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,51,298కి చేరింది.

నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా 10 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 6,847కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా నుంచి 2,178 మంది కోలుకున్నారు.

వీరితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,24,189కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,262 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు కరోనా కారణంగా అనంతపురం 105, చిత్తూరు 225, తూర్పుగోదావరి 259, గుంటూరు 202, కడప 43, కృష్ణ 202, కర్నూలు 45, నెల్లూరు 93, ప్రకాశం 51, శ్రీకాకుళం 58, విశాఖపట్నం 80, విజయనగరం 42, పశ్చిమ గోదావరిలలో 188 కేసులు నమోదయ్యాయి. అలాగే కృష్ణ 3, విశాఖపట్నం 2, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. 
 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్