ఏపీ: కొత్తగా 1540 మందికి కరోనా పాజిటివ్.. తూర్పుగోదావరిలో అత్యల్పంగా 3 కేసులు

Siva Kodati |  
Published : Jul 27, 2021, 05:29 PM ISTUpdated : Jul 27, 2021, 05:30 PM IST
ఏపీ: కొత్తగా 1540 మందికి కరోనా పాజిటివ్.. తూర్పుగోదావరిలో అత్యల్పంగా 3 కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 1,540 కరోనా కేసులు నమోదవ్వగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2,304 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,965 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,540 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,55,037కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,292కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 4, ప్రకాశం 5, పశ్చిమ గోదావరి 2, కృష్ణ 2, కడప 1, శ్రీకాకుళం 1, నెల్లూరులో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2,304 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,20,780కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 61,298 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,42,53,931కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,965 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 49, చిత్తూరు 280, తూర్పుగోదావరి 3, గుంటూరు 152, కడప 33, కృష్ణ 263, కర్నూలు 21, నెల్లూరు 210, ప్రకాశం 176, శ్రీకాకుళం 59, విశాఖపట్నం 112, విజయనగరం 14, పశ్చిమ గోదావరిలలో 168 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.  

 

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu