ఏపీలో కరోనావిజృంభణ: కొత్త 154 పాజిటివ్ కేసులు, మొత్తం 75 మంది మృతి

By telugu team  |  First Published Jun 8, 2020, 1:47 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 154 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 75 మంది మరణించారు.


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. లాక్ డౌన్ సడలింపుల తర్వాత ఏపీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చినవారి వల్ల కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 125 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చినవారిలో నమోదైన కేసులను కూడా లెక్కిస్తే ఆ సంఖ్య 154 ఉంది.

రాష్ట్రంలో మొత్తం కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య 4813కు చేరుకుంది. మొత్తం మరణాల సంఖ్య 75కు చేరుకుంది. ఏపీలో ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 2387 మంది డిశ్చార్జీ అయ్యారు. ఈ రోజు 34 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1381గా ఉంది.

Latest Videos

undefined

ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చినవారిలో నమోదైన కేసుల సంఖ్యను లెక్కిస్తే అది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గత 24 గంటల్లో 14,246 శాంపిల్స్ ను పరీక్షించగా 125 మందికి కరోనా సోకినట్లు తేలింది. 

ఇదిలావుంటే, ఇతర దేశాల నుంచి వచ్చినవారిలో 132 మందికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఈ రోజు ఒకరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. మొత్తం 126 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో గత 24 గంటల్లో 29 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయింది. మొత్తం 838 మందికి కరోనా వైరస్ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. గత 24 గంటల్లో 16 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. యాక్టివ్ కేసులు 520 ఉన్నాయి. 

 

: as on 08/06/2020
Positive cases: 3843
Discharged: 2387
Deceased: 75
Active cases: 1381 pic.twitter.com/7rZzR4gjry

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!