AP Budget 2023-24 ....బుగ్గన బడ్జెట్ ప్రసంగానికి అడ్డు : 14 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Published : Mar 16, 2023, 10:24 AM ISTUpdated : Mar 16, 2023, 10:28 AM IST
AP Budget  2023-24 ....బుగ్గన బడ్జెట్ ప్రసంగానికి  అడ్డు : 14 మంది  టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

సారాంశం

బడ్జెట్  ప్రసంగానికి అడ్డు తగిలిన   టీడీపీ సభ్యులను  ఏపీ అసెంబ్లీ నుండి  స్పీకర్ తమ్మినేని సీతారాం  సస్పెండ్  చేశారు.  సస్పెన్షన్ కు గురైన సభ్యులను  సభ నుండి వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో  గురువారంనాడు  టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి  మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  ప్రసంగానికి అడ్డు తగిలిన టీడీపీ సభ్యులను  ఇవాళ  ఒక్క రోజు  సభ నుండి  సస్పెండ్  చేశారు. 

 ఏపీ ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి   బడ్జెట్  చదివే సమయంలో  టీడీపీ  సభ్యులు  నిరసన వ్యక్తం  చేశారు.  టీడీపీ సభ్యులు  తమ స్థానాల్లో  లేచి నిలబడి  నినాదాలు  చేశారు. టీడీపీ సభ్యులను కూర్చోవాలని  స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు.  బడ్జెట్ ప్రసంగం తర్వాత  మీ అభిప్రాయాలను  చెప్పాలని స్పీకర్  సూచించారు.  టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్న నేపథ్యంలో  మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  బడ్జెట్  ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. ఈ సమయంలో  ఏపీ సీఎం  వైఎస్ జగన్  జోక్యం చేసుకున్నారు.  

 రాష్ట్ర ప్రజలంతా  టీడీపీ సభ్యుల వైఖరిని చూస్తున్నారని  సీఎం జగన్ చెప్పారు. బడ్జెట్ ప్రసంగానికి  టీడీపీ సభ్యులు  అడ్డుపడడం సరికాదన్నారు.  బడ్జెట్ ప్రసంగం వినడం ఇష్టం లేకపోతే  బయటకు వెళ్లాలని టీడీపీ సభ్యులను  కోరారు సీఎం జగన్. లేకపోతే  సభ నుండి టీడీపీ సభ్యులను బయటకు పంపి  సభ సజావుగా  జరిగేలా చూడాలని  సీఎం జగన్ స్పీకర్ తమ్మినేని సీతారాంను  కోరారు.  ఆ తర్వాత  కూడా  టీడీపీ సభ్యులను  కూర్చోవాలని  స్పీకర్  కోరారు. సభలో ఉండడం ఇష్టం లేకపోతే  వాకౌట్ చేయాలని టీడీపీ సభ్యులకు  స్పీకర్ సూచించారు. 

also read:AP Budget 2023-24లో పేదలకు పెద్దపీట: ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

అయినా  కూడా  టీడీపీ సభ్యులు  తమ తమ స్థానాల్లో నిలబడి  నిరసనకు దిగారు  ఈ సమయంలో  ఏపీ ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  టీడీపీ ఎమ్మెల్యేల ను సభ నుండి  సస్పెండ్  చేస్తూ తీర్మానాన్ని  ప్రవేశ పెట్టారు.ఈ తీర్మానాన్ని సభ ఆమోదించింది.బెందాళం ఆశోక్, అచ్చెన్నాయుడు,నందమూరి బాలకృష్ణ, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్య చౌదరినిమ్మకాయల చిన్నరాజప్ప, ఏలూరు సాంబశివరావు, గద్దె రామ్మోహన్ రావు తదితరులను  సభ నుండి  సస్పెండ్  చేస్తున్నట్టుగా  స్పీకర్ ప్రకటించారు.

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu