బెజవాడ గ్యాంగ్ వార్: పండు ముఠా దాడిలోనే సందీప్ మృతి, అరెస్టయిన 13 మంది వీరే...

By narsimha lodeFirst Published Jun 5, 2020, 4:34 PM IST
Highlights

యనమలకుదురు భూ సెటిల్ మెంట్ విషయంలో జరిగిన వివాదమే తోట సందీప్ హత్యకు  కారణమైందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. శుక్రవారం నాడు విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.


విజయవాడ: యనమలకుదురు భూ సెటిల్ మెంట్ విషయంలో జరిగిన వివాదమే తోట సందీప్ హత్యకు  కారణమైందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. శుక్రవారం నాడు విజయవాడ సీపీ ద్వారకా తిరుమల రావు తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

తోట సందీప్, పండులు ఇద్దరూ కూడ ఒకప్పుడు మంచి స్నేహితులని ఆయన చెప్పారు. గత నెల 30వ తేదీన మాట్లాడుకొందామని పిలిచుకొని కళ్లలో కారం కొట్టి దాడులు చేసుకొన్నారన్నారు.

సందీప్ హత్య కేసులో రేపల్లె ప్రశాంత్, రవితేజ, ప్రేమ్ కుమార్, ప్రభుకుమార్, శ్రీను నాయక్, వెంకటేష్, బూరి భాస్కర్, ప్రవీణ్ కుమార్,ఎర్రా  తిరుపతిరావు,. దుర్గా ప్రసాద్, అజయ్ సంతోష్, ప్రతాప్ సాయి లను అరెస్ట్ చేసినట్టుగా విజయవాడ సీపీ తెలిపారు.

యనమలకుదురులో ప్రదీప్ రెడ్డి, శ్రీధర్ లు అపార్ట్ మెంట్ నిర్మించారు. వీటి నిర్మాణం కోసం కోటిన్నర ఖర్చు చేశారు. . అయితే ఈ వెంచర్ నిర్మాణం కోసం కోటిన్నర ఖర్చు చేశారు.దీంతో శ్రీధర్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి మధ్య ఆర్ధిక లావాదేవీల మధ్య విబేధాలు నెలకొన్నాయి. ఈ వివాదాన్ని పరిష్కరించుకొనేందుకు గాను విజయవాడకు చెందిన నాగబాబును ఆశ్రయించారు. 

also read:విజయవాడ గ్యాంగ్ వార్‌లో మరో ట్విస్ట్: సందీప్‌ను పక్కా ప్లాన్‌తో హత్య చేశారన్న భార్య తేజస్విని

విజయవాడకు చెందిన  నాగబాబు ఈ విషయంలో సందీప్, పండులను ఆశ్రయించాడు.గత నెల 29వ తేదీన సందీప్ ఈ విషయమై ప్రదీప్, శ్రీధర్ లతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న సమయంలో పండూ కూడ అక్కడికి వచ్చారు. 

ఈ వివాదం సెటిల్ మెంట్ చేసే సమయంలో సందీప్ మాట్లాడుతున్న సమయంలో పండు అడ్డుకోవడంతో  సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో తల దూర్చకూడదని ఆయన హెచ్చరించారు.అదే రోజు రాత్రి సందీప్ తన అనుచరులతో పండు ఇంటికి వెళ్లి హెచ్చరించారు. ఆ సమయంలో పండు ఇంటి వద్ద లేడు. పండు తల్లితో  గొడవపడ్డాడు.

దీంతో గత నెల 30వ తేదీన పండు తన అనుచరులతో కలిసి సందీప్ షాపు వద్దకు వచ్చి గొడవకు దిగాడు. ఈ విషయమై ఫోన్‌లో గొడవకు దిగారు. అదే రోజు సాయంత్రం తోటవారి వీధిలో రెండు గ్యాంగ్ లు గొడవకు దిగాయన్నారు.ఈ గొడవలో సందీప్ తీవ్రంగా గాయపడి గత నెల 31వ తేదీన ఆసుపత్రిలో మరణించారన్నారు. 

సందీప్ పై 17 కేసులు, పండుపై మూడు కేసులు ఉన్నట్టుగా సీపీ తెలిపారు. సందీప్ పై గతంలో రౌడీషీట్ ఉందన్నారు. 2016లోనే హైకోర్టు ఆదేశాల మేరకు సందీప్ పై రౌడీషీట్ ను క్లోజ్ చేసినట్టుగా ఆయన చెప్పారు. సోషల్ మీడియాలో గ్రూపులపై నిఘాను కొనసాగిస్తామన్నారు. ఈ గ్రూపుల్లో కొందరిని కొందరు రాజకీయ పార్టీ నేతలు ఉపయోగించుకొన్నారని తమకు సమాచారం ఉందన్నారు.

నగరంలో ప్రశాంత జీవనానికి భంగం కల్గిస్తే  సహించబోమన్నారు. రోడ్లపై వచ్చి కొట్లాడేవాళ్లపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు.రౌడీలు, రౌడీలు కావాలనుకొనేవారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.
 

click me!