పూరీ జగన్నాథుడికి దర్శించుకుని తిరిగి వస్తుండగా ఏపీలో రోడ్డు ప్రమాదానికి గురయి 13మంది తెలంగాణవాసులు తీవ్రంగా గాయపడ్డారు.
జగ్గయ్యపేట : దైవ దర్శనం చేసుకుని స్వస్థలానికి తిరుగుపయనమైన భక్తులు రోడ్డు ప్రమాదానికి గురైన దుర్ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వల్ల టూరిస్ట్ టెంపో అదుపుతప్పి ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13మంది తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే... కామారెడ్డి జిల్లా గాంధారికి చెందిన కొందరు పూరి జగన్నాథుడిని దర్శించుకునేందుకు ఒడిషా వెళ్లారు. తిరుగుపయనంలో విశాఖలోని సింహాచలం లక్ష్మీనరసింహస్వామిని కూడా దర్శించుకున్నారు. ఇలా పలు దేవాలయాలను సందర్శించి గత రాత్రి టెంపో ట్రావెలర్ బస్సులో స్వస్థలానికి బయలుదేరారు. కానీ మార్గమధ్యలో ఈ బస్సు ప్రమాదానికి గురయి అందులోని వారంతా తీవ్రంగా గాయపడ్డారు.
undefined
వీడియో
వేగంగా దూసుకెళుతున్న బస్సు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి సమీపంలో ప్రమాదానికి గురయ్యింది. ఒక్కసారిగా టైరు పేలడంతో అదుపుతప్పిన బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సులోని ప్రయాణికులు గాయపడ్డారు.
Read More చనిపోయి మూడు నెలలైనా ఇంట్లోనే వృద్ధురాలి మృతదేహం.. ఏలూరులో ఘటన
రోడ్డు ప్రమాదంపై సమాచారం అందకున్న పోలీసులు క్షతగాత్రులను జగ్గయ్యపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల నుండి వివరాలు సేకరించి వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన అందరి పరిస్థితి మెరుగ్గానే వున్నట్లు తెలుస్తోంది.