కొత్తగా 129 కేసులు.. కృష్ణాలో అత్యధికం: ఏపీలో 8,87,720కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Jan 30, 2021, 07:49 PM IST
కొత్తగా 129 కేసులు.. కృష్ణాలో అత్యధికం: ఏపీలో 8,87,720కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 129 మందికి కరోనా సోకినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 8,87,720కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 129 మందికి కరోనా సోకినట్లుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 8,87,720కి చేరింది.

కరోనా కారణంగా నిన్న ఒక్కరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,153కి చేరింది.  ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,289 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న కోవిడ్ నుంచి 147 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,79,278కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 41,003 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు టెస్టుల సంఖ్య 1,30,95,962కి చేరింది.

నిన్న ఒక్కరోజు అనంతపురం 3, చిత్తూరు 12, తూర్పుగోదావరి 12, గుంటూరు 17, కడప 9, కృష్ణా  26, కర్నూలు 15, నెల్లూరు 8, ప్రకాశం 1, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 17, విజయనగరం 1, పశ్చిమ గోదావరిలలో 6 కేసులు చొప్పున నమోదయ్యాయి. 
 

PREV
click me!

Recommended Stories

పోలవరం, అమరావతి మాటల్లోనే.. చేతల్లో శూన్యంPerni Nani Slams Alliance Government | Asianet News Telugu
Liquor Bottles Incident in Tirumala తిరుమలలో మద్యం బాటిళ్ల ఘటనలో దొంగ దొరికాడు: సీఎం| Asianet Telugu