కొత్తగా 125 మందికి పాజిటివ్: ఏపీలో 8,87,591కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Jan 29, 2021, 06:33 PM IST
కొత్తగా 125 మందికి పాజిటివ్: ఏపీలో 8,87,591కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 125 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,87,591కి చేరుకుంది. కోవిడ్ కారణంగా నిన్న ఏ ఒక్కరూ మరణించలేదు.

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 125 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,87,591కి చేరుకుంది.

కోవిడ్ కారణంగా నిన్న ఏ ఒక్కరూ మరణించలేదు. గురువారం నాటికి కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 8,79,131కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,308 మంది చికిత్స పొందుతున్నారు.

గడిచిన 24 గంటల్లో 175 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,79,131కి చేరింది. నిన్న ఒక్కరోజు 42,809 మందికి కోవిడ్ టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య 1,30,54,959కి చేరింది.

గత 24 గంటల్లో అనంతపురం 5, చిత్తూరు 13, తూర్పుగోదావరి 14, గుంటూరు 19, కడప 1, కృష్ణా 26, కర్నూలు 3, నెల్లూరు 8, ప్రకాశం 1, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 19, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 9 కేసుల చొప్పున నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

Tirupati Darshan Tips : కేవలం 30 నిమిషాల్లో శ్రీవారిని దర్శించుకొండి, ఈ ఫాస్ట్ ట్రాక్ దర్శనం ఫ్రీ.. ఎలాగో తెలుసా?
ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంతోనే ఇంత ఘోరం జరిగింది | YS Jagan Visits Visakhapatnam to Console Families