భారీగా తగ్గిన కేసులు: ఏపీలో 8,87,466కి చేరిన సంఖ్య

Siva Kodati |  
Published : Jan 28, 2021, 08:32 PM IST
భారీగా తగ్గిన కేసులు: ఏపీలో 8,87,466కి చేరిన సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 117 మందికి కోవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 8,87,466కి చేరింది. నిన్న కరోనా కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 117 మందికి కోవిడ్ సోకినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 8,87,466కి చేరింది.

నిన్న కరోనా కారణంగా ఒక్క మరణం కూడా సంభవించలేదు. అయితే ఇప్పటి వరకు కోవిడ్ సోకి మరణించిన వారి సంఖ్య 7,152కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో 1,358 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 128 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,78,956కి చేరుకుంది. గత 24 గంటల్లో 36,189 మందికి కోవిడ్ టెస్టులు చేయడంతో ఇప్పటి వరకు మొత్తం పరీక్షల సంఖ్య 1,30,12,150కి చేరుకుంది.

నిన్న ఒక్కరోజు అనంతపురం 4, చిత్తూరు 16, తూర్పు గోదావరి 6, గుంటూరు 17, కడప 4, కృష్ణా 26, కర్నూలు 7, నెల్లూరు 6, ప్రకాశం 3, శ్రీకాకుళం 0, విశాఖపట్నం 19, విజయనగరం 2, పశ్చిమ గోదావరిలలో 7 కేసులు నమోదయ్యాయి. 

 

 

PREV
click me!

Recommended Stories

TTD: తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు అల‌ర్ట్‌.. బ్రహ్మోత్సవాల వేళ రూ. 300 టికెట్ల షెడ్యూల్ విడుద‌ల
AP Pensions: ఆంధ్ర‌ప్ర‌దేశ్ పెన్ష‌న్ల‌లో కీల‌క మార్పులు.. ఇక‌పై రెండు విధాలుగా డ‌బ్బులు