దారుణం : మహిళా సర్పంచ్ పై 11మంది లైంగిక దాడికి యత్నం...

By Bukka SumabalaFirst Published Aug 4, 2022, 6:41 AM IST
Highlights

ఓ మహిళా సర్పంచ్ మీద 11మంది సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారు. దీంతో ఆమె కేకలు వేయడంతో, చంపాలని ప్రయత్నించారు. చుట్టుపక్కలవారు రావడంతో గాయపరిచి పారిపోయారు. 

విజయనగరం :  విజయనగరం జిల్లా  పూసపాటిరేగ మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళా సర్పంచ్ 11మంది లైంగిక దాడికి ప్రయత్నించారు. ఈ మేరకు ఆమె బుధవారం విజయనగరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాను రేకుల షెడ్ లో ఉండగా బుధవారం మధ్యాహ్నం పి.రమణ బాబు, పి. సుధాకర్, పి. మధు, పి. జగదీష్, పి. భద్రరావు, ఎల్. సురేష్ కుమార్, ఏ. శ్రీనివాస రావు, ఎల్ వెంకటరాజు, పి. ప్రసాద్, ఈ సోమశేఖర్, పి. శ్రీనివాస రావు వచ్చి లైంగిక దాడికి ప్రయత్నించారని పేర్కొన్నారు. ప్రతిఘటించే ప్రయత్నంచేయడంతో చంపాలని చూశారని అన్నారు. మెడ భాగం,  పొత్తికడుపు, ఇతర అవయవాలపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారని వెల్లడించారు. కేకలు వేయగా చుట్టుపక్కలవారు రావడంతో పారిపోయారని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యామలాదేవి చెప్పారు. 

ఇదిలా ఉండగా, జూన్ 14న ఇలాంటి ఘటనే గుంటూరులో చోటు చేసుకుంది. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురం గ్రామ దళిత మహిళా సర్పంచ్ శిఖా విజయలక్ష్మి పట్ల వైసిపి నాయకులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె భర్త యాకోబు, కుమారుడు నవీన్ ను చంపేస్తామని బెదిరించారు. ఎస్ఐ ప్రతాప్ కుమార్ కథనం ప్రకారం.. ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని చెరువులో అక్రమంగా మట్టి తగ్గుతున్నట్లు సర్పంచ్ కి సమాచారం వచ్చింది. ఆమె తన భర్త, కుమారుడితో చెరువు వద్దకు వెళ్లి దీనిపై ప్రశ్నించారు.

సూర్యాపేట: ఎంపిడీవో వేధింపులు... టీఆర్ఎస్ మహిళా సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

వైసిపి నాయకులు మాచర్ల మధు, సురేష్ వారిని దుర్భాషలాడటంతో పాటు అసభ్యకరంగా ప్రవర్తించారు. మరో వైసీపీ నాయకుడు  మాచర్ల ఏసోబు సర్పంచ్ కుమారుడిని చంపేయాలని మిగిలినవారిని ఉసిగొలిపాడు. ‘నా వైపు  ఎమ్మెల్యే ఉన్నారు. మీకు దిక్కున్నచోట చెప్పుకోండి’ అని  బెదిరించాడని  ఆదివారం రాత్రి సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్ధరాత్రి కేసు నమోదైంది. గుంటూరులోని టిడిపి కార్యాలయంలో సర్పంచ్ విజయలక్ష్మి, భర్త యాకోబు, కుమారుడు నవీన్  తలదాచుకున్నారు. ఆదివారం రాత్రి  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు భయపడిన వారు టిడిపి జిల్లా నాయకులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి గుంటూరుకు చేరుకుని పార్టీ కార్యాలయంలోనే ఉన్నారు.

click me!