ఏపీలో కొత్తగా 10,392 మందికి పాజిటివ్: లక్ష దాటిన యాక్టివ్ కేసులు

Siva Kodati |  
Published : Sep 02, 2020, 06:14 PM ISTUpdated : Sep 02, 2020, 06:18 PM IST
ఏపీలో కొత్తగా 10,392 మందికి పాజిటివ్: లక్ష దాటిన యాక్టివ్ కేసులు

సారాంశం

ఏపీలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 10,392 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీనితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,55,331కి చేరింది.

గత 24 గంటల్లో 72 మంది కోవిడ్ కారణంగా మరణించారు. వీటితో కలిపి మొత్తం మరణాల సంఖ్య 4,125కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,03,076 యాక్టీవ్ కేసులున్నాయి.

నిన్న కొత్తగా 8,545 మంది కోవిడ్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 3,48,330కి చేరింది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 60,804 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య 38,43,550కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో అనంతపురం 810, చిత్తూరు 1,124, తూర్పుగోదావరి 1,199, గుంటూరు 900, కడప 800, కృష్ణ 397, కర్నూలు 697, నెల్లూరు 942, ప్రకాశం 800, శ్రీకాకుళం 603, విశాఖపట్నం 675, విజయనగరం 560, పశ్చిమ గోదావరిలలో 885 కేసులు నమోదయ్యాయి.

అలాగే కోవిడ్ కారణంగా నిన్న ఒక్క రోజే నెల్లూరు 11, చిత్తూరు 10, పశ్చిమ గోదావరి 9, ప్రకాశం 8, కృష్ణ 6, విశాఖపట్నం 6, అనంతపుపరం 4, తూర్పుగోదావరి 4, గుంటూరు  4, శ్రీకాకుళం 4, విజయనగరం 3, కడప 2, కర్నూలులో ఇద్దరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 

PREV
click me!

Recommended Stories

YS Jagan On Seediri Appalraju Son Issue | YS Jagan Press Meet | Asianet News Telugu
బాబు పాలనలో గంజాయికి గిట్టుబాటు ధర బాగుంది: YS Jagan | Asianet News Telugu