ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి: కొత్తగా 10,368 కేసులు... 84 మరణాలు

Siva Kodati |  
Published : Sep 01, 2020, 07:34 PM ISTUpdated : Sep 01, 2020, 07:36 PM IST
ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి: కొత్తగా 10,368 కేసులు... 84 మరణాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లో కొత్తగా 10,368 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,45,139కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. 24 గంటల్లో కొత్తగా 10,368 మందికి పాజిటివ్‌గా తేలినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య 4,45,139కి చేరుకుంది.

కరోనా కారణంగా 24 గంటల్లో 84 మంది మరణించడంతో.. మొత్తం మృతుల సంఖ్య 4,053కి చేరింది. గడిచిన 24 గంటల్లో 9,350 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 3,39,876కి చేరింది.

ప్రస్తుతం ఏపీలో 1,01,210 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 59,834 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా... మొత్తం టెస్టుల సంఖ్య 37,82,746కి చేరింది.

నిన్న ఒక్క రోజే అనంతపురం 456, చిత్తూరు 1,068, తూర్పు  గోదావరి 1,208, గుంటూరు 617, కడప 994, కృష్ణా 311, కర్నూలు 813, నెల్లూరు 1,059, ప్రకాశం 888, శ్రీకాకుళం 629, విశాఖపట్నం 825, విజయనగరం 552, పశ్చిమ గోదావరి జిల్లాలో 948 చొప్పున కేసులు నమోదయ్యాయి.

కోవిడ్ కారణంగా చిత్తూరు 14, పశ్చిమ గోదావరి 11, తూర్పుగోదావరి 10, అనంతపురం 7, గుంటూరు 7, విశాఖపట్నం 7, నెల్లూరు 6, కడప 5, కృష్ణ 4, కర్నూలు  4, శ్రీకాకుళం 4, ప్రకాశం 3, విజయనగరంలలో ఇద్దరు చొప్పున మరణించారు. 

PREV
click me!

Recommended Stories

అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu
YSRCP Mayor Candidate : నెల్లూరు మేయర్ అభ్యర్థిని ప్రకటించిన వైసిపి.. ఎవరీ విజయ్ కుమార్ రెడ్డి?