ఏపీలో మళ్లీ ఒక్క రోజులో పదివేలకు పైగా కేసులు: ఈ నాలుగు జిల్లాల్లోనే తీవ్రత

Siva Kodati |  
Published : Aug 22, 2020, 06:19 PM ISTUpdated : Aug 22, 2020, 06:23 PM IST
ఏపీలో మళ్లీ ఒక్క రోజులో పదివేలకు పైగా కేసులు: ఈ నాలుగు జిల్లాల్లోనే తీవ్రత

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,276 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,276 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 3,45,216కి చేరింది.

అలాగే 24 గంటల్లో 97 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 3,189కి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 61,469 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో మొత్తం టెస్టుల సంఖ్య 31,91,326కి చేరింది.

నిన్న ఒక్క రోజే 8,593 మంది కరోనా నుంచి కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 2,52,638కి చేరుకుంది. ఏపీలో ప్రస్తుతం 89,389 యాక్టివ్ కేసులున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,321 కేసులు నమోదయ్యాయి.  

ఆ తర్వాత అనంతపురం 1,020, చిత్తూరు 1,220, గుంటూరు 719, కడప 539, కృష్ణా 232, కర్నూలు 850, నెల్లూరు 943, ప్రకాశం 693, శ్రీకాకుళం 661, విశాఖపట్నం 540, విజయనగరం 505, పశ్చిమ గోదావరిలలో 1,033 మందికి పాజిటివ్‌గా తేలింది.

కరోనా కారణంగా చిత్తూరు జిల్లాలో 13 మంది, అనంతపురం 11, నెల్లూరు 10, తూర్పు గోదావరి 8, కడప 8, కర్నూలు 8, ప్రకాశం 8, పశ్చిమ గోదావరి 8, గుంటూరు 6, విశాఖపట్నం 6, శ్రీకాకుళం 5, కృష్ణ 3, విజయనగరంలలో ముగ్గురు చొప్పున మరణించారు. 

 

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్