ఏపీలోనూ ఒమిక్రాన్ అలజడి.. ఒకేసారి 10 కొత్త కేసులు, 16కి చేరిన సంఖ్య

By Siva Kodati  |  First Published Dec 29, 2021, 3:33 PM IST

కరోనా కొత్త వేరియంట్ దేశంలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. తాజా కేసులతో కలిపి ఏపీలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 16కి చేరింది. తూగో జిల్లాలో 3, అనంతలో 2, కర్నూలు 2, గుంటూరు, చిత్తూరు, ప.గో జిల్లాలో ఒక్కో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 


కరోనా కొత్త వేరియంట్ దేశంలో విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒకేసారి కొత్తగా 10 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడింది. తాజా కేసులతో కలిపి ఏపీలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 16కి చేరింది. 

మరోవైపు భారత్‌లో బుధవారం ఉదయం నాటికి ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 781కి చేరింది. దేశంలోని మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు 241 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వివరాలను వెల్లడించింది. ఢిల్లీలో అత్యధికంగా 238 Omicron Cases నమోదు కాగా, 161 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. 

Latest Videos

undefined

Also Read:Omicron Cases in India: భారత్‌లో 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

అటు దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,195 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,48,08,886కి చేరింది. నిన్న కరోనాతో 302 మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,80,592కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి 7,347 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,42,51,292కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 77,002 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది.  దేశంలో నిన్న 64,61,321 డోసుల పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,43,15,35,641కు చేరింది. 

click me!