ప్రీతి జింటా టాలీవుడ్ రీ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ..
టాలీవుడ్ లో రీ ఎంట్రీకి రెడీ అవుతోంది బాలీవుడ్ స్టార్ సీనియర్ బ్యూటీ ప్రీతి జింటా. ఎప్పుడు..? ఏ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందో తెలుసా..?
ప్రీతి జింటా.. గుర్తుందా.. సొట్టబుగ్గటతో కుర్రకారు మనసులు దోచేసిన బాలీవుడ్ బ్యూటీ. తెలుగులో ఆమె చేసింది రెండే రెండు సినిమాలు అయినా.. ఆరెండింటితోనే భారీగా ఫాలోయింగ్ ను తన ఖాతాలో వేసుకుంది ప్రీతి. బోలెడంత స్టార్ డమ్ ను సాధించింది ప్రీతి జింట. ఆరెండు సినిమాలే ఇప్పటికీ ప్రీతి జింటా అంటే గుర్తుపట్టేలా చేసింది.
కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?
ఇంతకీ ప్రీతి చేసిన ఆ రెండు సినిమాలుఏంటంటే...? తెలుగులో విక్టరీ వెంకటేష్ జోడీగా ప్రేమంటే ఇదేరా సినిమాతో పాటు.. సూపర్ స్టార్ మహేష్‌బాబు జోడీగా రాజకుమారుడు సినిమాల్లో నటించింద ప్రీతి. తన క్యూట్ స్మైల్, ఇన్నోసెంట్ ఫేస్.. బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్స్ తో అందాల ప్రీతి అందరిని ఆకట్టుకుంది.
మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?
ఇక తన నటనతో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ను కూడా మెప్పించిన ప్రీతి... ఆ రెండు సినిమాల తరువాత టాలీవుడ్ వైపు తిరిగి చూడలేదు. బాలీవుడ్ కే పరిమితం అయ్యింది. బాలీవుడ్ లో మాత్రం నాన్ స్టాప్ గా సినిమాలు చేసిన ప్రీతి.. 2028 లో సినిమాలకు బ్రేక్ వేసింది. పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన పవన్ కళ్యాణ్, బ్లాక్ బస్టర్ హిట్ ను వదిలేసుకున్న పవర్ స్టార్..?
ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ప్రీతి జింటా ఐపీఎల్ పంజాబ్ టీమ్ ఫ్రాంచైజీ ఓనర్ గా బిజీగా ఉంది. ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. 50 ఏళ్ళు దగ్గర పడుతున్నా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో, నెటిజన్లతో ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చింది ప్రీతి జింటా.
ఎన్టీఆర్ - కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..?
ఈ క్రమంలో ఓ నెటిజన్.. మీరు తెలుగు సినిమాల్లో మళ్ళీ నటిస్తారా అని అడగ్గా ప్రీతి జింటా సమాధానమిస్తూ.. నేను అసలు చేయను అని ఎప్పుడూ చెప్పలేదు. మంచి కథ వినిపిస్తే నేను నో చెప్పకుండా చేస్తాను అని తెలిపింది. ఇప్పుడే బాలీవుడ్ లో ఆరేళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రీతి జింటా మరి తెలుగులో కూడా స్పెషల్ క్యారెక్టర్ రోల్స్ తో ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.
కాస్టింగ్ కౌచ్.. సర్దుకుపోవాలి.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. శివగామి ఏమంటుందంటే..?
ఇక తాను నటించడానికి రెడీ అని డైరెక్ట్ గా చెపుతున్న ప్రీతి సమాధానం విని.. తెలుగు మేకర్స్ ఎవరైనా.. వారి సినిమాలకోసం స్పెషల్ గా ప్రీతీని తీసుకుంటారా లేదా అనేది చూడాలి.
సల్మాన్ ఖాన్ లవ్ లెటర్ చూశారా..? కండల వీరుడు ఎవరికి ప్రేమ లేఖ రాశాడంటే..?