ప్రతిరోజూ ఉదయం ధ్యానం చేయండి. దీని వల్ల రోజు ఫ్రెష్ గా స్టార్ట్ అవుతుంది. ఆ రోజంతా యాక్టివ్ గా ఉంటారు.
ఇంటి పనుల్లో పడి మహిళలు పోషకాహారంపై దృష్టి పెట్టరు. ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మీ శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి.
ఇంటి పనులు చేస్తూ ఇక ప్రత్యేకంగా వ్యాయామం చేయాలంటే మహిళలు ఆసక్తి చూపరు. కాని ఎక్సర్ సైజ్ చేస్తేనే శరీరానికి శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది.
ఇంటి పనులు చిన్నవిగానే అనిపించినా శ్రమ చాలా ఉంటుంది. అందువల్ల మహిళలకు తగినంత విశ్రాంతి చాలా అవసరం. చదవడం, హెర్బల్ టీ తాగడం, ధ్యానం చేయడం ద్వారా మంచి విశ్రాంతి దొరుకుతుంది.
చాలామంది ఫోన్ చూస్తూ రిలాక్స్ అవుదాం అనుకుంటారు. కాని కళ్లు, చెవులు, బ్రెయిన్, చేతులు ఇలా చాలా పార్టులు పనిచేయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ మీరు చూసే స్క్రీన్ సమయాన్ని తగ్గించండి.
మహిళలు చాలా స్మూత్ గా ఉంటారు. కాని అవసరమైనప్పుడు 'వద్దు' అని చెప్పడం నేర్చుకోవాలి. దీనివల్ల మీ వ్యక్తిత్వం అందరికీ అర్థమవుతుంది. మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.