Woman

ఇలా చేస్తే మడమల పగుళ్లు వెంటనే తగ్గిపోతాయి

పాదాల పగుళ్లు

చలికాలంలో ఎన్నో రకాల చర్మ సమస్యలు వస్తాయి. మడమల పగుళ్ల నుంచి పొడిబారడం వరకు చాలా సమస్యలు కాళ్ల అందాన్ని దెబ్బతీస్తాయి. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే మీ పాదాలు అందంగా ఉంటాయి. 

ఉప్పు నీళ్లు..

మీకు తెలుసా? చలికాలంలో పాదాల చర్మం బాగా డీహైడ్రేట్ అవుతుంది. అయితే గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి అందులో పాదాలను కొంచెం సేపు ఉంచి స్క్రబ్ చేయండి. డెడ్ స్కిన్ తొలగిపోతుంది. 

మాయిశ్చరైజర్

మాయిశ్చరైజర్ కేవలం ముఖానికి మాత్రమే కాదు పాదాల చర్మానికి కూడా మంచిది. ఇది పాదాల చర్మాన్ని తేమగా ఉంచుతుంది. పగుళ్లు తక్కువ కావాలంటే ఎక్స్‌ఫోలియేషన్ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోండి.

సాక్సులు

రాత్రిపూట పాదాలకు సాక్సులు వేసుకుని పడుకుంటే మీకు చలి పెట్టదు. అలాగే డ్రై స్కిన్, పాదాల పగుళ్లు వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. ఇది మీ పాదాలను సాఫ్ట్ గా ఉంచుతుంది.

పెడిక్యూర్ అవసరం

పాదాల పగుళ్లు తగ్గాలంటే రెగ్యులర్ గా పెడిక్యూర్ చేయించుకోండి. ఇంట్లోనే దీన్ని తయారుచేసుకుంటే తక్కువ టైంలోనే మీ పాదాలు అందంగా ఉంటాయి. 

నీటి కొరత

చలికాలంలో మనలో ప్రతి ఒక్కరూ నీళ్లను చాలా తక్కువ తాగుతారు. కానీ దీనివల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుంది. మీరు గనుక రోజూ 8 గ్లాసుల నీటిని తాగితే మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది. 

పాదాలు పూలలా వికసిస్తాయి

ఈ చిన్న చిన్న చిట్కాలను గనుక పాటిస్తే మీ పాదాలు పువ్వుల్లా అందంగా వికసిస్తాయి. అందంగా ఉంటాయి. పాదాలు బాగా పగిలినా, గాయాలైనా డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే ఏ క్రీమ్‌నైనా వాడండి.

Find Next One