Telugu

చీరకు ఫాల్ ఎందుకు వేయాలి? వేయకుంటే ఏమవుతుంది?

Telugu

చీరకు రక్షణ

సిల్క్, బెనారసి లేదా కంచిపట్టు వంటి ఖరీదైన చీరలకు ఫాల్ ఒక రక్షణ పొరలా పనిచేస్తుంది. దీనివల్ల బోర్డర్ త్వరగా చిరగదు, దారాలు బయటకు రావు, చీర ఎక్కువ కాలం కొత్తదానిలా కనిపిస్తుంది.

Image credits: ఇన్‌స్టాగ్రామ్
Telugu

కుచ్చిళ్లు నీట్‌గా ఉండటానికి

చీరకు ఫాల్ లేకపోతే కుచ్చిళ్లు వదులుగా, చెల్లాచెదురుగా కనిపిస్తాయి. ఫాల్ వల్ల కుచ్చిళ్లకు బరువు వస్తుంది. నీట్ గా కనిపిస్తాయి.

Image credits: ఇన్‌స్టాగ్రామ్
Telugu

ఆ సమస్య దూరం

తేలికైన, పలుచని చీరలలో లోపలి పెట్టికోట్ లేదా కాళ్లు కనిపించే అవకాశం ఉంది. ఫాల్ వేయడం వల్ల ఈ సమస్య ఉండదు. 

Image credits: ఇన్‌స్టాగ్రామ్@sareeslay
Telugu

కంఫర్ట్ కోసం..

ఫాల్ లేకుంటే చీర అంచు పదే పదే కాళ్లకు చుట్టుకుపోవచ్చు. ఫాల్ వేయడం వల్ల అంచు కాళ్లకు తలగకుండా ఉంటుంది. 

Image credits: ఇన్‌స్టాగ్రామ్@sareemanufacturierwholesaller
Telugu

ప్రతి చీరకు ఫాల్ అవసరమా?

షిఫాన్, జార్జెట్, క్రేప్, నెట్, తేలికపాటి సిల్క్ చీరలకు ఫాల్ తప్పనిసరిగా వేయించుకోవాలి. భారీ బోర్డర్ ఉన్న చీరలకు కొన్నిసార్లు ఫాల్ అవసరం లేకపోవచ్చు.

Image credits: ఇన్‌స్టాగ్రామ్@nayashadhanbad
Telugu

ఫాల్ ఎలా ఎంచుకోవాలి?

చీర రంగు కంటే ఒక షేడ్ ముదురు రంగును ఎంచుకోవాలి. ఫాల్‌ను ఎప్పుడూ కాటన్ లేదా సిల్క్ బ్లెండ్ ఫ్యాబ్రిక్‌లో ఎంచుకోవడం మంచిది. 

Image credits: జెమిని AI

లైట్ వెయిట్ లో బంగారు నెక్లెస్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్.. చూసేయండి

లేటెస్ట్ డిజైన్ లో నల్లపూసల బ్రేస్‌లెట్.. వెయిట్ కూడా తక్కువే

ట్రెండీ లుక్ కోసం ఈ బ్లౌజ్ డిజైన్స్ బెస్ట్ ఆప్షన్

Silver Black beads: వెండి నల్లపూసలు..ఎంత బాగున్నాయో, బంగారంతో పనిలేదు