Woman
ఆడవాళ్లకు చీరలంటే ప్రాణం. పెళ్లిళ్ల నుండి పండుగల వరకు చీరలకు ఎన్నో రకాల చీరలను కడుతుంటారు. ఏదేమైనా ప్రతి ఒక్క మహిళా అవతలి వారికంటే అందంగా ఉండే చీరనే కొనాలనుకుంటుంది.
మన ఇండియాలో ఎన్నో దుస్తుల మార్కెట్లు ఉన్నాయి.ఇక్కడ దుస్తులు చౌకగా లభిస్తాయి. కానీ మన దేశంలో ఉన్న కొన్ని మార్కెట్లలో 1, 2 వేలల్లోనే హీరోయిన్లు కట్టేటటువంటి చీరలను కొనొచ్చు.
ప్రతి మార్కెట్లో మనకు ఎన్నో రకాల చీరలు దొరుకుతాయి. కేవలం 10 వేల లోపే మీరు అదిరిపోయే చీరలను కొనొచ్చు. అదెక్కడంటే?
హీరోయిన్లలా స్టైలిష్ చీరలను కట్టాలనుకుంటే మహారాష్ట్రలోని భివాండి చీరల మార్కెట్ కు తప్పక వెళ్లండి. మీరు ఇక్కడ సెలబ్రిటీల మాదిరిగానే అందమైన చీరలు సరసమైన ధరలకే కొనొచ్చు.
భివాండిని టెక్స్‌టైల్ హబ్‌గా పరిగణిస్తారు. ఇక్కడ చీరల ధర ₹50 నుంచే స్టార్ట్ అవుతుంది. మీరు రెగ్యులర్ చీరలను ఇక్కడ చాలా తక్కువ ధరకే కొనొచ్చు.
సూరత్ చీరల తయారీకి కేంద్రం. ప్రింటింగ్, చున్నీ, లెహంగా చీరలను ఇక్కడ ఎక్కువగా తయారు చేస్తారు. మీకు ఈ రకమైన చీరలు ఇష్టమైతే సూరత్ చీరల మార్కెట్‌కు తప్పకండా వెళ్లండి.
పెళ్లి షాపింగ్ కోసం ఢిల్లీలోని చాందినీ చౌక్ మార్కెట్ బెస్ట్. ఎందుకంటే ఇక్కడ వధువుల కోసం లేటెస్ట్ డిజైన్ల చీరలు తక్కువ ధరలకే వస్తాయి.
సరోజినీ మార్కెట్ గురించి చాలా మంది వినే ఉంటారు. ఢిల్లీలో ఉండేవారు సరసమైన ధరలకే చీరలు కావాలనుకుంటే ఇక్కడికి వెళ్లండి. ఇక్కడ అందమైన చీరలు ఉంటాయి.
సింథటిక్ చీరలను కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా బీహార్‌లోని నలందా జిల్లాలో ఉన్న సోహసరాయ్ చీరల మార్కెట్ కు వెళ్లండి. ఇక్కడ సూరత్ నుంచి వచ్చిన చీరలు హోల్‌సేల్‌లో ధరకే లభిస్తాయి.