Woman

టీచర్స్ డేకి ఇలాంటి అందమైన చీరలను కూడా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు

ప్రింటెడ్ కాటన్ చీర

చాలా మంది టీచర్స్ కాటన్ చీరలను బాగా ఇష్టపడతారు. ఎందుకంటే ఇవి కంఫర్ట్ గా ఉంటాయి. ఈ టీచర్స్ డే కి  జెనిఫర్ వింగెట్ లాంటి పింక్, వైట్ కలర్ ప్రింటెడ్ కాటన్ చీరలు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు.

ఫ్లోరల్ సిల్క్ చీర

టీచర్లకి ఎంబ్రాయిడరీ చీరలు కూడా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. మీరు సింపుల్ గా ఉన్న ఫ్లోరల్ ప్రింట్ ఉన్న సిల్క్ చీరను కూడా టీచర్స్ డే రోజు గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. 

చికన్ కారీ చీర

మీ టీచర్ కి చాలా అందమైన చీర గిఫ్ట్ గా ఇవ్వాలనుకుంటే చికన్ కారీ వర్క్ చీరలను గిఫ్ట్ గా ఇవ్వొచ్చు. ఈ తరహా చీరలు మీకు కాస్త ఖరీదు ఎక్కువగా ఉంటాయి. 

హెవీ బార్డర్ చీర

చాలా వెడల్పుగా ఉన్న హెవీ బార్డర్ ఉన్న మూడు రంగుల కాటన్ సిల్క్ చీరలు కూడా చాలా అందంగా ఉంటాయి. మీకు నచ్చిన రంగులో కూడా ఈ చీరలను కొనొచ్చు. ఇవి 1000 రూపాయల లోపు దొరుకుతాయి. 

సీక్విన్ చీర

పార్టీ వేర్ కి సీక్విన్ చీరలు బాగా నప్పుతాయి. ఈ తరహా అందమైన చీరలు మీకు 2000 రూపాయల లోపు దొరుకుతాయి.

ప్రీ-డ్రేప్డ్ చీర

చీర కట్టుకోవడం రాని వారికి ప్రీ డ్రేప్డ్ చీరలు బెస్ట్ ఆప్షన్. మీ టీచర్ కి నచ్చే విధంగా ఈ తరహా చీరలు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఎంబ్రాయిడరీ బ్రౌన్ సాటిన్ చీర

మీ టీచర్ కి కొత్తగా ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్సులంటే ఇష్టం ఉంటే వాళ్లకు సాటిన్ మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బ్రౌన్ కలర్ చీరను గిఫ్ట్ గా ఇవ్వచ్చు.ఈ చీరలు చాలా సింపుల్ లుక్ నిస్తాయి. 

ప్యూర్ పట్టుచీరను గుర్తించేదెలా?

రూ.75కే మెరిసిపోయే అందం ఎలానో తెలుసా?

స్త్రీలు ఆర్థికంగా ఎలా స్మార్ట్‌గా ఉండాలి

కిచెన్‌లో ఒక రకమైన దుర్వాసన వస్తోందా? ఇలా చేస్తే అస్సలు రాదు