Woman

అందమైన మీ పాదాలకున్న మెట్టెలు, పట్టీలు మెరిసిపోవాలంటే ఇలా చేయండి

మెట్టెలు నల్లగా మారిపోతున్నాయా

తరచుగా మీ పాదాలకున్న మెట్టెలు నల్లగా మారిపోతున్నాయా? వాటిని తక్షణమే ఎలా మెరిసేలా చేయాలో కొన్ని ప్రత్యేక ఇంటి చిట్కాలను ఇక్కడ తెలుసుకోండి.

బేకింగ్ సోడాతో శుభ్రం

మీ మెట్టెలు శుభ్రం చేయడానికి బేకింగ్ సోడాను ఉపయోగించండి. అందులో కాస్త నీటిని కలిపి పేస్ట్‌లా తయారు చేయండి. దాన్ని మెట్టెలపై పూసి కొంత సేపు అలాగే ఉంచండి. 

బ్రష్‌తో క్లీన్ చేయండి

కొద్దిసేపటి తర్వాత అందులో బుడగలు రావడం ప్రారంభమవుతాయి. ఒక క్లాత్ లేదా బ్రష్ తో బాగా రుద్ది శుభ్రం చేయండి. ఇది కాలి ఉంగరాల్లో పేరుకుపోయిన మురికి, నలుపును తొలగిస్తుంది.

వినిగర్ తో కడగండి

ఒక గిన్నెలో వెనిగర్, నీటిని సమాన పరిమాణంలో కలపండి. దీనిలో కొంత సేపు మీ కాలి పట్టీలు, మెట్టెలను నానబెట్టండి.

మెరిసిపోయే ఆభరణాలివిగో

ఎటువంటి శ్రమ లేకుండానే మీ ఆభరణాల నుండి మురికి తొలగిపోవడాన్ని మీరు చూస్తారు. మీరు దానిని తేలికగా రుద్దితే సరిపోతుంది. మీ కాలి ఉంగరాలు కొత్తలా మెరిసిపోతాయి.

హాట్ వాటర్, లిక్విడ్

మీ కాలి మెట్టెలు, పట్టీలను వేడి నీటిలో వేసి, దానిలో కొన్ని చుక్కల లిక్విడ్ వేయండి. ఇప్పుడు పాత టూత్ బ్రష్ తో వాటిని శుభ్రం చేసుకోండి. ఇలా కూడా ఆభరణాల నలుపును తొలగించవచ్చు.

3 ఏళ్ల వామికకు అనుష్క శర్మ ఎలాంటి ఫుడ్ పెడుతుందో తెలుసా?

ముఖానికి ఆముదం రాస్తే ఏమౌతుంది?

టీచర్స్ డేకి ఇలాంటి అందమైన చీరలను కూడా గిఫ్ట్ గా ఇవ్వొచ్చు

ప్యూర్ పట్టుచీరను గుర్తించేదెలా?