Woman
బయోటిన్ అనేది కరిగే విటమిన్, ఇది మన శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు, జుట్టు పొడుగ్గా పెరిగేందుకు చాలా అవసరం. బయోటిన్ ఎక్కువగా ఉండే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
గుడ్లలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టును ఆరోగ్యంగా, బలంగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే గుడ్డులో ఉండే ప్రోటీన్లు జుట్టు పెరగడానికి సహాయపడతాయి.
బాదం పప్పుల్లో మెగ్నీషియం, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటుగా బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రోజూ గుప్పెడు బాదం పప్పులు తింటే మీ జుట్టు పొడుగ్గా పెరుగుతుంది.
చిలగడదుంపల్లో బీటా కెరోటిన్, బయోటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన జుట్టును బలంగా ఉంచడానికి సహాయపడతాయి.
పాలకూరలో ఐరన్, బయోటిన్, ఫోలేట్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
అవకాడోలో బయోటిన్, విటమిన్ ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు మెండుగా ఉంటాయి. ఇవి మన జుట్టుకు మంచి పోషణను అందించి పొడుగ్గా పెరిగేలా చేస్తాయి.