Woman
సబ్బులో ఉండే కఠినమైన రసాయనాలు చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కొన్ని సబ్బులు చర్మం pH బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తాయి. చర్మాన్ని రఫ్ గా మార్చేస్తాయి.
సబ్బులో ఉండే కాస్టిక్ యాసిడ్ చర్మంలోని సహజ నూనెలను తొలగించి చర్మాన్ని పొడిగా చేస్తుంది.
సబ్బుల నిరంతర వినియోగం కొల్లాజెన్ విచ్ఛిన్నం, నిర్జలీకరణానికి దారితీస్తుంది. ఇది ముడతలు, చారలు, మసకబారిన రంగుకు కారణమవుతుంది.
ముఖానికి క్రమం తప్పకుండా సబ్బు వాడటం వల్ల చర్మ ఉపరితలంపై రంధ్రాలు మూసుకుపోతాయి.
కొన్ని సబ్బుల్లో ఉండే సువాసనలు, ప్రిజర్వేటివ్‌లు చర్మంపై ముడతలు కలిగిస్తాయి.
ఎల్లప్పుడూ గ్లిజరిన్, పాలు కలిగిన సబ్బులు వాడటానికి ప్రయత్నించండి. ఇవి చర్మంలో తేమను నిలుపుకుని, మృదువుగా చేస్తాయి. ఫేస్ వాష్ లు కూడా వాడొచ్చు.