Woman

ఈ చిట్కాలు ఫాలో అయితే ..మీ నడుము సైజు తగ్గడం పక్కా

Image credits: Getty

కార్డియో వ్యాయామాలు

ప్రతిరోజూ 30 నుంచి 45 నిమిషాల పాటు కార్డియో వ్యాయామాలైన స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్ వంటివి వచేస్తే మీ జీవక్రియ పెరిగి బరువు తగ్గుతారు. 

ప్లాంక్, ఆబ్స్ వ్యాయామాలు

 ప్లాంక్, సైడ్ ప్లాంక్, క్రంచెస్ వంటి ఆబ్స్ వ్యాయామాలు చేస్తే బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. ఈ వ్యాయామాలను ప్రతిరోజూ 3-4 సెట్లు  చేస్తే మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. 

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారాలు

ప్రోటీన్లు పుష్కలంగా ఉండే పప్పులు,గుడ్లు, చికెన్, చేపలు వంటి ఆహారాలను తింటే మీ కండరాలు బలంగా ఉంటాయి. అలాగే మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు బరువు తగ్గుతారు. 

గ్రీన్ టీ, హెర్బల్ టీలు

గ్రీన్ టీ తాగితే మీ జీవక్రియ పెరిగి బరువు తగ్గుతారు. అంతేకాదు నిమ్మకాయతో పాటుగా కొన్ని డీటాక్స్ పానీయాలు కూడా వెయిట్ లాస్ కు సహాయపడతాయి. 

చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు

మీ పొట్ట, బరువు తగ్గాలంటే మాత్రం మీరు చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలను వీలైనంత తగ్గించాలి. ఇవి మీ శరీరంలో ఫ్యాట్ ను పెంచుతాయి.అందుకే వీటికి బదులు పండ్లు, కూరగాయలు తినండి. 

ఎక్కువ నీళ్లు తాగాలి

బరువు తగ్గాలనుకుంటే మీరు నీళ్లను పుష్కలంగా తాగాలి. ఇది జీవక్రియను నియంత్రిస్తుంది. అలాగే శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపుతుంది. అందుకే రోజుకు 8-10 గ్లాసుల నీళ్లు తాగాలి.

8 గంటలు నిద్ర

మానసిక, శారీరక ఆరోగ్యానికి 7 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. మీరు కంటినిండా నిద్రపోకపోతే మీరు ఏం చేసినా బరువు తగ్గరు. అలాగే మానసిక ఒత్తిడి తగ్గడానికి యోగా, ధ్యానం చేయండి.

Find Next One