Woman
ఆడవారికి బంగారు నగలంటే చాలా ఇష్టం. కానీ కొంత కాలం తర్వాత ఇవి పాతబడిపోతుంటాయి.
పాతబడిన బంగారు నగలను కొన్ని సింపుల్ చిట్కాలతో చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
లిక్విడ్ డిటర్జెంట్ తో కూడా బంగారు నగలను శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం ముందుగా నగలను ఈ లిక్విడ్ లో నానబెట్టి బ్రష్‌తో శుభ్రం చేయండి. 5 నిమిషాల్లోనే కొత్తవాటిలా మెరిసిపోతాయి.
టూత్‌పేస్ట్ తో కూడా మీరు నగలను క్లీన్ చేయొచ్చు.ఇందుకోసం నీళ్లలో టూత్ పేస్ట్ ను కలిపి దాంతో నగలను క్లీన్ చేయండి. ఇది నగలపై ఉన్న మురికిని పోగొడుతుంది.
ఒక నిమ్మకాయ రసం తీసుకుని అందులో నగలను 20 నుంచి 30 నిమిషాల పాటు నానబెట్టండి. ఇది నగలను శుభ్రం చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
పసుపుతో కూడా నగలను శుభ్రం చేయొచ్చు.ఇందుకోసం కొంచెం పసుపును తీసుకుని నీటిలో వేసి మరిగించండి. తర్వాత డిటర్జెంట్ పౌడర్ ను కలిపి బ్రష్ తో నగలను శుభ్రం చేయండి.