Woman
మీరు ఇప్పటి వరకు చాలా రకాల పట్టుచీరల గురించి విని ఉంటారు. అత్యంత ఖరీదైన ఈ లోటస్ పట్టుచీర గురించి విన్నారా? కమలం పూలతో చేసే ఈ చీర ప్రత్యేకత ఏంటో తెలుసా?
ఈ లోటస్ సిల్క్ ఫ్యాబ్రిక్ అన్నిచోట్లా దొరకదు. ప్రపంచవ్యాప్తంగా 4 దేశాలు అంటే.. కంబోడియా, మయన్మార్, వియత్నాం, భారత దేశంలో మాత్రమే తయారౌతుంది.
ఈ లోటస్ సిల్క్ ని కమలం పువ్వు కాండం నుంచి తయారు చేస్తారు. ఒక్క చీర తయారీకి సంవత్సరం పడుతుంది. ఈచీర వేసవిలో చల్లగా, చలికాలంలో వెచ్చని అనుభూతి మనకు కలిగిస్తుంది.
కమలం కాండంను విరిచి, సన్నని జిగటగా ఉండే పోగుల నుండి పట్టు దారం తయారు చేస్తారు. తర్వాత ఆరబెడతారు. కాండం కత్తిరించిన 24 గంటల్లో దారాలను తయారు చేయాలి, లేకుంటే అవి విరిగిపోతాయి.
ప్రతిరోజూ కాండం కత్తిరించి పట్టు దారం తయారు చేస్తారు. తరువాత చేతితో దారంతో చీర నేస్తారు. ఈ పట్టును తయారు చేయడానికి యంత్రాలను ఉపయోగించరు.
భారతదేశపు మొట్టమొదటి లోటస్ సిల్క్ తయారీదారు మణిపూర్‌కు చెందిన విజయశాంతి. విజయశాంతి 2018 నుండి లోటస్ సిల్క్ తయారు చేయడం ప్రారంభించారు.
లోటస్ సిల్క్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చీరలలో ఒకటి. దీనిని కేవలం 4 దేశాల్లో మాత్రమే తయారు చేస్తారు. దీని తయారీ ప్రక్రియ కష్టం, ఒక పట్టు స్కార్ఫ్ తయారు చేయడానికి 2 నెలలు పడుతుంది.