Woman
భారతీయ మహిళలు పట్టుచీరలు ఇష్టపడకుండా ఉండరు,అయితే.ఖరీదైన సిల్క్ చీరలను గుర్తించడంలో చాలాసార్లు మోసపోతాం, ప్యూర్ పట్టును ఎలా గుర్తించాలో చూద్దాం..
రియల్ పట్టు పట్టు పురుగుల నుండి తయారవుతుంది. పాలిస్టర్, సింథటిక్ వంటి వాటితో నకిలీ సిల్క్‌ను తయారు చేస్తున్నారు. అసలి సిల్క్ చాలా మృదువుగా ఉంటుంది. తాకితే మనకు అర్థమవుతుంది.
పట్టు చీరలలో బనారస్, కాంచీపురం, చందేరి, ఆర్ట్ సిల్క్, టస్సర్ సిల్క్ వంటి దాదాపు 23 రకాల చీరలు ఉన్నాయి.
బనారస్ సిల్క్ చీరల పల్లవులో చేతితో ఎంబ్రాయిడరీ చేస్తారు. ఇది చాలా అందంగా ఉంటుంది. జరీ పనితనం, బుటీలు, ఇతర డిజైన్లు కూడా బనారస్ చీరలను గుర్తించడంలో సహాయపడతాయి.
కాంచీపురం చీరలలో వివిధ రకాల దారాలను ఉపయోగిస్తారు. కాబట్టి దూరం నుండి చూసినప్పుడు దారాల అల్లిక మారుతూ కనిపిస్తాయి. చీర రంగు కూడా మారుతున్నట్లు కనిపిస్తుంది.
కాంచీపురం సిల్క్ చీరలలో జరీ పనితనం ఎక్కువగా ఉంటుంది. జరీ పనితనంపై మీ గోరుతో స్క్రాచ్ చేస్తే ఎర్రటి సిల్క్ దారాలు కనిపిస్తాయి. అలా కాంచీపురం చీర అని నిర్ధారించుకోవచ్చు.
సిల్క్ చీరలకు ఒక మెరుపు ఉంటుంది. బనారస్ చీరలలో మొఘల్ నమూనాల అద్భుతమైన ప్రింట్లు కనిపిస్తాయి. సాంప్రదాయ డిజైన్లు కూడా బనారస్ సిల్క్‌ను గుర్తించడంలో సహాయపడతాయి.
సిల్క్ చీరలను వేలు ఉంగరం గుండా కూడా సులభంగా బయటకు తీసుకురావచ్చు. బనారస్ సిల్క్ చీరల ధర రూ.20,000 వరకు ఉంటుంది. అంతకన్నా ఎక్కువగా కూడా ఉండొచ్చు.