Skin Care: రాత్రి పడుకునే ముందు ఇవి రాస్తే..ఉదయానికి మెరిసే చర్మం
woman-life May 07 2026
Author: ramya Sridhar Image Credits:Asianet News
Telugu
పడుకునే ముందు డబుల్ క్లెన్సింగ్
పగలు రాసే సన్ స్క్రీన్, మేకప్ తొలగించడానికి రాత్రిపటూ పడుకునే ముందు డబుల్ క్లెన్సింగ్ చేయాలి. ఆయిల్ బేస్డ్ క్లెన్సర్, వాటర్ బేస్డ్ క్లెన్సర్ తో ముఖాన్ని రెండుసార్లు వాష్ చేయాలి.
Image credits: Asianet News
Telugu
స్క్రబ్ వద్దు..సీరమ్ ముద్దు...
స్క్రబ్‌లకు బదులుగా వారానికి రెండు, మూడుసార్లు లాక్టిక్ యాసిడ్ వంటి సీరమ్స్ వాడాలి. ఇది మృతకణాలను తొలగించి చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది.
Image credits: Getty
Telugu
హైడ్రేటింగ్ సీరమ్
రాత్రిపూట హైలురోనిక్ యాసిడ్ ఉన్న సీరమ్స్ వాడటం వల్ల చర్మంలో తేమ నిలిచి ఉంటుంది. ఉదయాన్నే ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
Image credits: Asianet News
Telugu
మాయిశ్చరైజింగ్
చర్మం సహజ రక్షణ పొరను కాపాడుకోవడానికి సెరమైడ్స్ ఉన్న మాయిశ్చరైజర్ వాడాలి. ఇది చర్మం పొడిబారకుండా చూసుకుంటుంది.
Image credits: Getty
Telugu
అండర్ ఐ కేర్
రాత్రిపూట కళ్ల కింద ఐ క్రీమ్ లేదా సీరమ్ రాయడం వల్ల నల్లటి వలయాలు తగ్గుతాయి. కంటి చుట్టూ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
లిప్ మాస్క్
పెదవులు పొడిబారకుండా ఉండాలంటే రాత్రిపూట చిక్కటి లిప్ బామ్ లేదా లిప్ మాస్క్ వాడాలి. ఇది పెదవులను మృదువుగా, ఆరోగ్యంగా మారుస్తుంది.
Image credits: Getty
Telugu
స్లీపింగ్ మాస్క్‌లు
ఇంకా ఎక్కువ మెరుపు కావాలనుకునేవారు వారానికి ఒకసారి స్లీపింగ్ మాస్క్‌లు ప్రయత్నించవచ్చు. నిద్రలో ఉన్నప్పుడు ఇవి చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి.