Face Glow:ముల్తానీ మట్టిలో ఇవి కలిపి ముఖానికి రాస్తే ముఖం మెరిసిపోద్ది
woman-life May 05 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
ముల్తానీ మట్టి- గ్రీన్ టీ
గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ముల్తానీ మట్టిలో గ్రీన్ టీ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ముఖం ఫేషియల్ చేసినట్లుగా మెరిసిపోతుంది.
Image credits: pinterest
Telugu
పెరుగు, పసుపుతో మ్యాజికల్ ప్యాక్
చర్మంపై ట్యాన్‌ను తొలగించడానికి ముల్తానీ మట్టిలో కొద్దిగా పెరుగు, చిటికెడు పసుపు కలపాలి. ఈ ప్యాక్ వేసుకుంటే చర్మానికి రెట్టింపు గ్లో వస్తుంది.
Image credits: pinterest
Telugu
రోజ్ వాటర్‌తో మ్యాజిక్
జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే చర్మ రంధ్రాలు శుభ్రపడతాయి. చర్మానికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది.
Image credits: pinterest
Telugu
తేనె, పాలతో సాఫ్ట్ లుక్
పొడి చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిలో తేనె, పాలు కలిపి వాడుకోవచ్చు. ఈ ప్యాక్ చర్మాన్ని పొడిబారనివ్వకుండా మృదువుగా చేస్తుంది. చర్మంలో తేమను కూడా నిలుపుతుంది.
Image credits: pinterest
Telugu
అలోవెరాతో చర్మానికి చల్లదనం
ఎండకు చర్మం ఎర్రబడితే.. ముల్తానీ మట్టిలో అలోవెరా జెల్ కలిపి ముఖానికి రాయాలి. దీని వల్ల చర్మానికి ఉపశమనం కలుగుతుంది.
Image credits: Freepik
Telugu
కాఫీ పౌడర్, ముల్తానీ మట్టి
ఇది ఒక అద్భుతమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుంది. కాఫీ పౌడర్, ముల్తానీ మట్టి మిశ్రమంతో ముఖంపై మసాజ్ చేస్తే మృతకణాలు తొలగిపోతాయి. ముఖానికి తక్షణ ఉత్తేజం వస్తుంది.
Image credits: social media
Telugu
వాడేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ముల్తానీ మట్టి ప్యాక్‌ను ముఖంపై పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచొద్దు. ప్యాక్ కొద్దిగా తడిగా ఉన్నప్పుడే కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మంలోని సహజ నూనెలు పోకుండా ఉంటాయి.