Woman

సబ్బుతో కాదు, బంక మట్టితో స్నానం చేస్తే ఎన్ని లాభాలున్నాయో

చర్మం, జుట్టుకి ప్రయోజనకరం

ముల్తానీ మట్టి చర్మానికి, జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు ముల్తానీ మట్టితో స్నానం చేస్తే ఎన్నో లాభాలను పొందుతారు. 

ముల్తానీ మట్టి

కలబంద జెల్ లో ముల్తానీ మట్టిని కలిపి జుట్టుకు పెట్టుకోవచ్చు. ఇది జుట్టును కండిషనింగ్ చేస్తుంది. అలాగే నెత్తిమీ చుండ్రు లేకుండా చేస్తుంది. 

ముల్తానీ మట్టితో స్నానం

జుట్టుకు ముల్తానీ మట్టిని పెట్టుకున్న తర్వాత సగం బకెట్ వాటర్ ను తీసుకుని అందులో మూడు కప్పుల ముల్తానీ మట్టి పొడి, 2 టీస్పూన్ల శెనగపిండి, అర టీస్పూన్ పసుపును వేసి కలపండి.  

మట్టి నీళ్లు

ఈ సగం బకెట్ వాటర్ ను నెమ్మదిగా శరీరంపై పోసుకుంటూ.. మొత్తం బాడీని తడపండి. కొద్ది సేపటి వరకు దాన్ని అలాగే ఉంచండి. 

ముల్తానీ మట్టి ప్రయోజనాలు

ముల్తానీ మట్టి మురికి చర్మాన్ని తొలగిస్తుంది. అలాగే చర్మ రంధ్రాలను ఓపెన్ చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది. చర్మాన్ని మరింత కాంతివంతంగా చేస్తుంది. 

మచ్చలు తొలగిపోతాయి

ముల్తానీ మట్టి చర్మం ముఖంపై ఉండే నల్ల మచ్చలను పోగొట్టడంలో చాలా ఎపెక్టీవ్ గా పనిచేస్తుంది. మీరు వారానికి 2 నుంచి 3 సార్లు ముల్తానీ మట్టితో స్నానం చేయొచ్చు.

జాగ్రత్త

చాలా మంది ముఖానికి ముల్తానీ మట్టిని పెట్టిన తర్వాత గంటల తరబడి ముఖాన్ని కడగకుండా ఉంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. అలాగే మట్టితో స్నానం చేసిన కొంతసేపటికే శరీరాన్ని కడగాలి.

పెదాలు పగిలి ఇబ్బంది పెడుతున్నాయా?

పాకిస్తానీతో కలిసి.. లండన్ ట్రిప్ లో సారా టెండుల్కర్

కుంకుమ పువ్వు వేసిన పాలు తాగితే ఏమౌతుంది..?

ట్రెండీ ఇయర్ రింగ్స్... ఏ డ్రెస్ కి అయినా సూటౌతాయి