డీప్ బ్యాక్ కట్స్ బ్లౌజ్ ను వేసుకుంటే మీరు స్టైలీష్ గాకనిపిస్తారు. అలాగే మీ శరీరాన్ని స్లిమ్ గా, పొడుగ్గా కినిపించేలా చేస్తాయి. తక్కువ బరువున్న చీరలకు ఈ బ్లౌజులు సెట్ అవుతాయి.
పొడుగ్గా ఉండే బ్లౌజుల్లో మీరు పొట్టిగా కనిపిస్తారు. కాబట్టి నడుము కంటే కొంచెం పైకి ఉండే బ్లౌజులు వేసుకోండి. వీటిలో మీరు పొడుగ్గా, సన్నగా కనిపిస్తారు.
వీ-షేప్ లేదా డీప్ నెక్ బ్లౌజ్ ను వేసుకుంటే మీ మెడ పొడుగ్గా, మీరు స్లిమ్ గా కనిపిస్తారు. బ్లౌజ్ లెంగ్త్, స్లీవ్స్ షార్ట్‌గా ఉంటే అందంగా కనిపిస్తారు.
పొడుగ్గా ఉండే స్లీవ్స్ మీ చేతులను సన్నగా, పొడుగ్గా కనిపించేలా చేస్తాయి. ఇవి మీ మొత్తం లుక్ ను స్లిమ్ గా, స్టైలీష్ గా చూపిస్తాయి.
డార్క్ కలర్, తక్కువ ఎంబ్రాయిడరీ బ్లౌజులు మీ శరీరాన్ని టోన్డ్ గా చూపిస్తాయి. అందుకే మీరు హెవీ, పెద్ద ప్రింట్ ఉన్న బ్లౌజులు వేసుకోకండి.
నిలువు రేఖలు ఉన్న డిజైన్ బ్లౌజులు మిమ్మల్ని పొడుగ్గా, స్లిమ్ గా కనిపించేలా చేస్తాయి. బ్లౌజ్ నెక్ డీప్‌గా, స్లీవ్స్ షార్ట్‌గా ఉంటే అందంగా కనిపిస్తారు.