Woman

ఫ్రిజ్ లో కరివేపాకును ఇలా పెడితే ఎన్ని నెలలైనా పాడవదు

కరివేపాకును ఎలా నిల్వ చేయాలి?

కరివేపాకును అంటుకున్న దుమ్ము, ధూళిని తొలగించడానికి వాటిని బాగా కడగండి. తర్వాత తడి లేకుండా బాగా ఆరబెట్టండి. 

ఆకులను వేరు చేయడం

ఆ తర్వాత ఆకులను కాడల నుంచి వేరు చేయండి. పాడైన ఆకులను, పసుపు రంగులో ఉన్న ఆకులను పారేయండి. పచ్చగా, శుభ్రంగా ఉన్న ఆకులనే నిల్వ చేయండి.

ఐస్ ట్రేను ఉపయోగించండి

తడి ఆరిన తర్వాత కరివేపాకులను చిన్న చిన్న ముక్కలుగా చేసి ఐస్ క్యూబ్ ట్రేలో పేర్చండి. ప్రతి క్యూబ్‌లో 4-5 ఆకులు ఉంచితే సరిపోతుంది.

నీళ్లు పోయాలి

 ఈ ట్రేలల్లో కరివేపాకుపై కొన్ని నీళ్లను పోయండి. దీంతో ఆకులు గడ్డకట్టేటప్పుడు ఒకదానికొకటి అతుక్కుపోకుండా, ఎండిపోకుండా ఉంటాయి. నీళ్లకు బదులుగా కొబ్బరినూనెను కూడా వాడొచ్చు. 

కరివేపాకు ఐస్ ట్రేని ఫ్రిజ్‌లో ఉంచాలి

ఇక ఈ ఐస్ క్యూబ్ ట్రేలని ఫ్రీజర్‌లో ఉంచి 4-5 గంటలు గడ్డకట్టనివ్వండి. ఇవి పూర్తిగా గడ్డ కట్టే వరకు ఉంచాలి.

నిల్వ చేయండి

ఆకులు పూర్తిగా గడ్డకట్టిన తర్వాత క్యూబ్స్‌ని ట్రే నుంచి తీసి గాలి చొరబడని సంచి లేదా డబ్బాలో వేసి నిల్వ ఫ్రీజర్‌లో పెట్టండి.

ఎక్కువ కాలం ఉపయోగించండి

ఈ విధంగా మీరు కరివేపాకును ఎక్కువ కాలం తాజాగా ఉంచొచ్చు. అలాగే అవసరమైనప్పుడు ఉపయోగించొచ్చు. 

Find Next One