Woman

మురికి సోఫా కుషన్లను ఎలా శుభ్రం చేయాలి?

కుషన్స్ ఎందుకు శుభ్రం చేయాలి?

మనకు తెలియదు కానీ.. సోఫా కుషన్స్‌ లో మట్టి, దుమ్ము, ధూళి, బ్యాక్టీరియాలు బాగా పేరుకుపోతాయి. వీటివల్ల అవి మురికిగా మారడమే కాకుండా.. రోగాలు కూడా వస్తాయి.అందుకే వీటిని శుభ్రం చేయాలి.

కుషన్ కవర్లు

సోఫా కుషన్స్ ను శుభ్రం చేయడానికి ముందుగా సోఫా నుంచి కుషన్ కవర్లను తీసి సోపుతో లేదా మెషిన్‌లో ఉతికేయండి.

కుషన్స్ దులపండి

సోఫా నుంచి కుషన్లను తీసిసన తర్వాత బయటకు తెచ్చి వాటిని బాగా దులపండి. దీంతో వాటికి అంటుకున్న దుమ్ము, మట్టి తొలగిపోతాయి. 

కుషన్స్ ఎండలో ఆరేయండి

మీకు వీలైనప్పుడల్లా  కుషన్స్ ను కాసేపు ఎండలో ఆరేయండి. దీంతో వాటికి అంటుకున్న  బ్యాక్టీరియా, దుర్వాసనలు తొలగిపోతాయి. 

బేకింగ్ సోడా

సోఫా కుషన్లకు అంటుకున్న మురికి పోవాలంటే వాటిపై నేరుగా బేకింగ్ సోడాను చల్లండి. కొంతసేపటి తర్వాత వాషింగ్ మెషిన్ లో వేసి క్లీన్ చేయండి. 

బ్లీచ్ వాడండి

కొన్ని నీళ్లలో బ్లీచ్ లను కలిపి కుషన్లపై స్ప్రే చేయండి. ఒక 15 నిమిషాల తర్వాత కుషన్లను బ్రష్ తో శుభ్రం చేయండి.

వెనిగర్

వెనిగర్ తో కూడా మీరు సోఫా కుషన్లను చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం వెనిగర్, నీళ్లను మిక్స్ చేసి కుషన్లపై స్ప్రే చేయండి. ఆ తర్వాత శుభ్రమైన గుడ్డతో క్లీన్ చేయండి. 

స్టీమ్ క్లీనింగ్

మీ సోఫా కుషన్లు మరీ వాటిని స్టీమ్ తో కూడా శుభ్రం చేయొచ్చు. ఈ పద్ధతి కుషన్లను చాలా లోతుగా క్లీన్ చేస్తుంది. వాటికి అంటుకున్న బ్యాక్టీరియాను కూడా తొలగిస్తుంది. 

మొక్కజొన్న పిండి

మొక్కజొన్న పిండితో కూడా ఎంతటి మురికి సోఫా కుషన్లనైనా చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం మొక్కజొన్న పిండిని కుషన్లపై చల్లి క్లీన్ చేయండి. ఇది మురికి, చెమట, మరకలను తొలగిస్తుంది. 

Find Next One