Woman

అందమైన పెదవుల కోసం 7 న్యూడ్ లిప్‌స్టిక్ టెక్నిక్స్

లిప్ బామ్ తో ప్రారంభం

న్యూడ్ లిప్‌స్టిక్ వేసుకునే ముందు మీ పెదాలను బాగా మాయిశ్చరైజ్ చేయండి. దీని కోసం మంచి లిప్ బామ్ వేసుకోండి. దీని వల్ల మీ పెదాలు పొడిబారవు. లిప్‌స్టిక్ సున్నితంగా అప్లై అవుతుంది.

లిప్ లైనర్ ఉపయోగం

పెదాలను న్యూడ్ షేడ్ కంటే ముదురు లైనర్‌తో డిఫైన్ చేయండి. పెదాల సహజ ఆకారం కంటే కొంచెం బయట లైనింగ్ చేయండి. దీని వల్ల పెదాలు నిండుగా, పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి.

ఫౌండేషన్ లేదా కన్సీలర్ బేస్

మీ పెదవుల రంగు కొంచెం ముదురుగా ఉంటే న్యూడ్ లిప్‌స్టిక్ వేసుకునే ముందు తేలికపాటి ఫౌండేషన్ లేదా కన్సీలర్ పెదాలపై వేసుకోండి. దీని వల్ల అసలు రంగు బాగా కనిపిస్తుంది.

హైలైటర్ వాడండి

న్యూడ్ లిప్‌స్టిక్‌ను మరింత అందంగా మార్చడానికి పెదాల మధ్య, పైన కొద్దిగా హైలైటర్ కాని, షిమ్మర్ కాని వేసుకోండి. దీని వల్ల మీ పెదాలు నిండుగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

మ్యాట్, గ్లాస్ మిక్స్

న్యూడ్ లిప్‌స్టిక్‌కి స్టైలిష్ టచ్ ఇవ్వడానికి మ్యాట్ న్యూడ్ లిప్‌స్టిక్ పైన తేలికపాటి లిప్ గ్లాస్ కోట్ వేసుకోండి. దీని వల్ల పెదాలు ఫ్రెష్ గా, గ్లాసీగా కనిపిస్తాయి. 

కొంచెం ముదురు షేడ్ బెటర్

మీ న్యూడ్ లుక్‌కి కొంచెం డెఫినిషన్ ఇవ్వాలనుకుంటే పెదాల లోపలి భాగంలో కొంచెం ముదురు షేడ్ లిప్‌స్టిక్ వేసుకోండి. దీని వల్ల మీ పెదాలకు ఒక ఓంబ్రే ఎఫెక్ట్ వస్తుంది.

లిప్‌స్టిక్ సెట్ చేయడానికి పౌడర్

న్యూడ్ లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉండాలంటే వేసుకున్న తర్వాత కొద్దిగా ట్రాన్స్‌లూసెంట్ పౌడర్ వేసుకోండి. దీని వల్ల మీ పెదాలు ఎక్కువసేపు ఫ్రెష్ గా, మ్యాట్ గా కనిపిస్తాయి.

ఈ ట్రిక్స్ తో టైట్ అయినా గాజులు వేసుకోవచ్చు!

ధంతేరాస్ కి బంగారం కొంటున్నారా? తక్కువ ధరకి బెస్ట్ డిజైన్స్

అంబానీ కోడలు రాధిక బర్త్ డే లో సెలబ్రెటీల సందడి

నల్ల పూసలతో బ్రేస్లెట్స్, అదిరిపోయే డిజైన్స్