Woman
పెళ్లిళ్ల నుంచి ఇంట్లో చిన్న చిన్న దావత్ ల వరకు ఆడవాళ్లు పట్టుచీరలు కట్టుకోకుండా ఉండలేరు. నిజానికి ఆడవాళ్లకు ఇతర చీరలకంటే పట్టుచీరలంటేనే చాలా ఇష్టం. ఇవి ఖరీదైనా.. అందంగా ఉంటాయి.
ఆడవాళ్ల అందాన్ని పెంచే పట్టు చీరల తయారీ అంత సులువైన ప్రాసెస్ కాదు. మీకు తెలుసా? మన దేశం పట్టు ఉత్పత్తిలో 18% వాటాను కలిగి ఉంది. మరి ఈ పట్టు చీరను ఎలా తయారుచేస్తారంటే..
పట్టు పురుగులను మల్బరీ ఆకులతో పెంచుతారు. ఇవి లార్వా లేదా గూడును ఏర్పరుస్తాయి. వీటినే పట్టు చీరను తయారుచేయడానికి ఉపయోగిస్తారు.
మీకు తెలుసా? ప్రతి ఆడ పట్టుపురుగు 100 మీటర్ల పొడవున్న ఒకే పట్టుదారాన్ని తయారు చేస్తుంది. ఈ దారం పట్టుపురుగు చుట్టూ అల్లుకుని ఉంటుంది. కానీ దీన్ని వేరు చేయడం చాలా కష్టం.
గూడు నుంచి పట్టు దారాన్ని వేరు చేయడానికి దాన్ని వేడి నీటిలో ఉడకబెడతారు. నీరు మరీ ఎక్కువ వేడిగా ఉంటే దారం పాడవుతుంది. అలాగే దీన్ని శుభ్రం చేయడానికి పదే పదే కడుగుతారు.
ఈ దారాలను కడిగిన తర్వాత పట్టు దారాలను బ్లీచ్ చేసి రంగులు వేస్తారు. పట్టు నాణ్యత దెబ్బతినకుండా సహజ రంగులనే ఉపయోగిస్తారు. ఆ తర్వాత దారాలను బాగా ఆరబెడతారు.
పట్టు చీరను తయారుచేయడానికి ముందు ఈ దారాలను బాగా తిప్పుతారు.ఒకప్పుడు ఈ దీనిని చేతితో చేసేవారు, ఇప్పుడు మెషిన్లను వాడుతున్నారు.
ఇక చివరిగా మెషిన్లు, ప్రింటింగ్ సాయంతో అందమైన పట్టు చీరలను నేస్తారు. చీరలకు ఫినిషింగ్ టచ్ ఇచ్చి అవి అందంగా మెరిసేవిగా, మృదువుగా చేస్తారు.