మహిళల్లో ఐరన్ లోపం ఉంటే అధిక అలసట వస్తుంది. అదీ ఏ కారణం లేకుండా.
ఐరన్ లోపం వల్ల చర్మం పాలిపోతుంది. దీనివల్ల గోళ్ళు కూడా దెబ్బతింటాయి.
ఐరన్ లోపం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది.
చేతులు, కాళ్ళు చల్లగా ఉంటే లేదా ఇతరులకన్నా మీకు ఎక్కువ చలిగా అనిపిస్తే, అది ఐరన్ లోపం కావచ్చు
హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే శరీరంలో ఆక్సిజన్ ప్రసరణ తగ్గుతుంది. దీనివల్ల ఊపిరి ఆడటంలో ఇబ్బంది కలుగుతుంది.
తలనొప్పి, తలతిరగడం, మానసిక ఒత్తిడి, నిరాశ, నాలుకపై తెల్లటి పూత వంటివి కూడా ఐరన్ లోపం లక్షణాలు.