Woman

ఇలా చేస్తే మసాలా దినుసులకు పురుగులు పట్టవు

మసాలా దినుసులు

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రోజూ ఉపయోగించే మసాలా దినుసులకు పురుగులు, కీటకాలు పడతాయి. దీంతో అవి పనికి రాకుండా పోతాయి. 

మసాలా దినుసులు

వర్షాకాలంలో తేమ వల్ల మసాలా దినుసుల్లో పురుగులు, బూజు పెరగడానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది.

మసాలా దినుసులు

అయితే మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే మసాలా దినుసుల్లో ఒక్క పురుగు కూడా లేకుండా చేయొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మసాలా దినుసులకు పురుగులు పట్టకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వీటిని మసాలా దినుసుల డబ్బాలో వేసి ఉంచండి. 

లవంగాలు

లవంగాలు చక్కెరకు చీమలు పట్టకుండా చేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఇందుకోసం చక్కెర డబ్బాలో 5-6 లవంగాలను వేయండి. 

సరిగ్గా నిల్వ చేయండి

మసాలా దినుసులు చాలా రోజులు నిల్వ ఉండాలంటే అవి పూర్తిగా ఎండి ఉండాలి. అవసరమైనప్పుడు తక్కువ పరిమాణంలో మసాలా దినుసులను పొడి చేసుకోవడం మంచిది.

చిన్న ప్యాకెట్లలో నిల్వ

 మసాలా దినుసులను పెద్ద పెద్ద డబ్బాల్లో నిల్వ చేస్తే పురుగులు పట్టే అవకాశం ఉంది. కాబట్టి వాటిని చిన్న ప్యాకెట్ లో నిల్వ చేయండి. 

Find Next One